చిన్న సినిమాలకు ప్రేక్షకుల్లో చూడాలి అనే తపన తీసుకురాలంటే యూనిట్ చేతిలో ఉండే ప్రధాన ఆయుధం టీజర్ అంతకంటే ప్రధానం ట్రైలర్  అయితే ఆయుధం లక్ష్యన్ని గురి తప్పకుండా ఆడియెన్స్ హృదయాల్లో చేరాలంటే ఆ సినిమాలో బలమైన కథ ఉంటే చాలు. అప్పుడు క్రమంగా వసూళ్ళు వాటంతటవే పెరిగిపోతాయి. 



ఇలాంటి వాటికి ఉదాహరణగా చెప్పాల్సివస్తే పెళ్ళిచూపులు, గీత గోవిందం. సరైన దృశ్యాలను వీడియో కట్ చేసి టీజర్స్ వదిలితే థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుణ్ణి కట్టి పడేస్తే చాలు వసూళ్ళ వరదే. 
Related image
ఇంకో రకంగా క్రేజ్ తీసుకు రావాలంటే బోల్డ్-నెస్ తో ట్రైలర్ని నింపేయాలి. అప్పుడు ఆ సినిమాకు ప్రేక్షకులు గుంపులుగా రావటాన్ని ఎవడు ఆపలేడు. ఈ మధ్య కాలం లో చిన్న సినిమాల్లో ఎక్కువగా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసేలా వసూళ్ళను రాబడుతున్న చిత్రాల్లో బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలే ఎక్కువ. ఉదాహరణకు ఆరెక్స్- 100, అర్జున్ రెడ్డి ఇలా చెపితే లిస్ట్ చాంతాడైపోతుంది.  
Related image
ఇక రీసెంట్ గా విడుదలైన "నేను లేను" అనే ట్రైలర్ కూడా అదే తరహా లో ఆడియెన్స్ ని ఆకర్షించేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది.దీన్ని చూసాక ఏం ట్రైలర్ రా! బాబు! అనకుండా ఉండలేరు.  లిప్ లాక్, - ఘాటు రొమాన్స్ - డబుల్ మీనింగ్ డైలాగులకు బోనసుగా పరిదిని మించిన శృంగారం పాళ్ళు జతచేసి స్టఫ్ నింపి ట్రైలర్ వదిలేసారు. అదనంగా యాక్షన్ సీన్స్ ను కూడా గట్టిగానే నింపేశారు. పూర్తిగా కొత్తవారైన నటీనటులు ఈ సినిమా వసూళ్ళని ఆపలేరని ఆ టీజర్ చూస్తే అర్ధమవుతోంది. 
Image result for nenu lenu movie 2018
ఎక్స్ కేటగిరీ సినిమాల్లో డైలాగ్స్ ను బట్టి సినిమా వివిధ జానర్స్ ను మన మదిలో గిర్రున తిరిగేలా చేస్తోంది. నేను చచ్చిపోయాను అని చెప్పే హీరో, సమాధిలో తేలడం అంతే కాకుండా విధి మా ఇద్దరిని వేరు చేసిందని "లవ్ యాంగిల్" ని చూపిస్తూ ఎదో సస్-పెన్స్ ఉందని చెపుతూ అన్ని కోణాల్లో ట్రైలర్ ను చిత్రీకరించి వీడియో బాగానే కట్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తే అంతా క్లియర్ గా అర్థమవుతుంది. 

Image result for nenu lenu movie 2018

మరింత సమాచారం తెలుసుకోండి: