పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల గాజు గ్లాసు గుర్తును కేటాయించిన నేపధ్యంలో ఈ గుర్తు పై కూడ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సామాన్యులు అందరికీ తెలిసిన గుర్తును తమ పార్టీకి కేటాయించినందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే కృతజ్ఞతలు తెలియచేసాడు. అంతేకాదు ఈ గుర్తును జనం మధ్యకు తీసుకు వెళ్ళడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాడు పవన్. 

ఇలాంటి పరిస్థుతులలో వివాదాలకు చిరునామాగా మారిన శ్రీరెడ్డి ‘జనసేన’ గుర్తు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘జనసేన’ గాజుగ్లాస్ గుర్తు బీరు గ్లాసా - వైన్ గ్లాసా - స్కాచ్ గ్లాసా అంటూ సెటైర్లు వేసింది. అయితే ఈ సెటైర్లను పెద్దగా పవన్ అభిమానులు పట్టించుకోలేదు. ఈ విషయం జరిగి కొన్ని రోజులు కూడ కాకుండానే ఏకంగా జాతీయ మీడియా పవన్ ‘జనసేన’ ఎన్నికల గుర్తును టార్గెట్ చేస్తూ కామెంట్స్ రాయడం చాలందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ది హిందూ’ పత్రిక పొలిటికల్ ఎడిటర్ ‘జనసేన’ గుర్తు పై సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు పవన్ ‘జనసేన గుర్తును పోలిన రెండు గాజు గ్లాస్ లను ఇమేజ్ లు పెట్టి పాల గ్లాసా బీరు గ్లాసా అన్నట్లుగా ఆమె సింబల్స్ పెట్టి ఈమె కూడ కామెంట్స్ చేసింది. ఇది చాలదు అన్నట్లుగా ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ సీఎన్ఎన్ ఐబీఎన్ సీనియర్ ఎడిటర్ సైతం కామెంట్స్ పెడుతూ పవన్ పార్టీకి ‘గ్లాసు కాకుండా చెంబు’ ఎన్నికల గుర్తుగా పెడితే బాగుండేది అంటూ ఘాటైన సెటైర్లు వేసాడు. 

దీనితో జాతీయ మీడియా ద్వారా పవన్ గుర్తు పై బురద జల్లాలని ఎవరో కావాలని ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అంటూ పవన్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్. అంతేకాదు ‘ది హిందూ’ లాంటి గౌరవప్రదమైన పత్రికలో పనిచేసే వ్యక్తి ఇలాంటి కామెంట్లు చేయడమేంటని పవన్ అభిమానులు ప్రశ్నించడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు హిందూ పత్రిక యాజమాన్యం సీఎన్ఎన్ యాజమాన్యం క్షమార్పణ చెప్పాలని కోరుతున్నారు. అయితే జాతీయ స్థాయి నాయకులనే లెక్క చేయని జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ అభిమానుల బెదిరింపులకు లొంగుతుందా అన్నదే ప్రశ్న..   


మరింత సమాచారం తెలుసుకోండి: