ఎన్.టి.ఆర్ బయోపిక్.. ఇప్పుడు అందరి చూపు ఆ బయోపిక్ మీదే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నటించడమే కాదు నిర్మాతగా కూడా తన ప్రత్యేకత చూపిస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుందు. 


ఇక ఆ విషయానికొస్తె.. రామారావుగా బాలకృష్ణ నటిస్తున్నాడని తెలిసిందే. దాదాపు సినిమా మొత్తం మీద బాలయ్య బాబు ఎన్.టి.ఆర్ వేసిన 60 గెటప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా మొదటి పార్ట్ లో బసవతారకంగా విద్యాబాలన్ అద్భుతంగా నటించారట. ఇక నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రాం నటించగా రానా మాత్రం చంద్రబాబుగా కనిపించారు.


ఏయన్నార్ గా అక్కినేని ఫ్యామిలీ నుండి సుమంత్ చేయడం జరిగింది. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, జయసుధగా పాయల్ రాజ్ పుత్, జయప్రదగా హాన్సిక కనిపిస్తార్ట. వీరే కాకుండా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించిన వారు ఎవరు.. వాళ్లు ఏయే పాత్రల్లో నటించారు అన్నది చిత్రయూనిట్ ఓ ప్రకటన చేసింది.


బసవరామతారకం: విద్యాబాలన్
నందమూరి త్రివిక్రమరావు: దగ్గుబాటి రాజా
నందమూరి హరికృష్ణ: కల్యాణ్ రామ్
లోకేశ్వరి: పూనమ్ బజ్వా
భువనేశ్వరి: మంజిమామోహన్ 
సాయికృష్ణ: గారపాటి శ్రీనివాస్
పురంధేశ్వరి: హిమన్సీ
ఉమామహేశ్వరి: హీరోషిని కోమలి
నందమూరి రామకృష్ణ: రోహిత్ భరద్వాజ్
అక్కినేని నాగేశ్వరరావు: సుమంత్
రామోజీరావు: గిరీష్
ఎస్వీ రంగారావు: ఈశ్వర్ బాబు
నారా చంద్రబాబునాయుడు: దగ్గుబాటి రానా
మండలి వెంకటకృష్ణారావు: మండలి బుద్ధప్రసాద్
హెచ్‌ఎంరెడ్డి: కైకాల సత్యనారాయణ
దాసరి నారాయణరావు: చంద్ర సిద్ధార్థ్ 
రేలంగి: బ్రహ్మానందం
నాగిరెడ్డి: ప్రకాష్ రాజ్
ఆలూరి చక్రపాణి: మురళీ శర్మ
ఎల్వీ ప్రసాద్: జిషు సేనుగుప్త
శ్రీదేవి: రకుల్ ప్రీత్ సింగ్
నాదెండ్ల భాస్కరరావు: సచిన్ ఖేదేకర్
బి ఏ సుబ్బారావు: నరేష్
పీ పుల్లయ్య: శుభలేఖ సుధాకర్
కేవీరెడ్డి: క్రిష్ జాగర్లమూడి
పీతాంబరం: సాయి మాధవ్ బుర్రా
బి విఠలాచార్య: ఎన్ శంకర్
కృష్ణకుమారి: ప్రణీత సుభాష్
వెంపటి చినసత్యం: శివ శంకర మాస్టర్
సావిత్రి: నిత్యామీనన్
జయప్రద: హన్సిక మోత్వాని
ప్రభ: శ్రీయ
జయసుధ: పాయల్ రాజపుత్
యోగానంద్: రవిప్రకాష్ 
తాతినేని ప్రకాష్ రావు: ఇంటూరి వాసు
టీ వెంకటరాజు: సురభి జయచంద్ర
పేకేటి శివరాం: భద్రం
షావుకారు జానకి: షాలిని పాండే
పింగళి: సంజయ్ మార్కస్ 
బార్ట్లే: అర్జున ప్రసాద్
గుమ్మడి: దేవీ ప్రసాద్
జీ వరలక్ష్మీ: ప్రత్యూష
పుండరీకాక్షయ్య: నాగేశ్వరరావు
కమలాకర్ కామేశ్వర రావు: ఎస్వీ కృష్ణారెడ్డి
ఇందిరాగాంధీ: సుప్రియా వినోద్
సి. నారాయణరెడ్డి: రామజోగయ్య శాస్ట్రీ 
ఎమ్‌జి రామచంద్రన్: సికిందర్
కన్నప్ప: సునీల్ కుమార్ రెడ్డి
డీ వీ నరసరాజు: శ్రీనివాస్ అవసరాల
కె రాఘవేంద్రరావు: కె ప్రకాష్
సలీం మాస్టర్: రఘు మాస్టర్
దగ్గుపాటి వెంకటేశ్వరరావు: భరత్ రెడ్డి
చల్మేశ్వర్ రావు: నాగరాజ్
రూఖ్మాంగధ రావు: వెన్నెల కిషోర్ 


మరింత సమాచారం తెలుసుకోండి: