ఆవిడ అలనాటి నటీమణి, తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో 200 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించిందామె. ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి వంటి నటులతో హీరోయిన్ గా నటించి అలరించింది. ఆమే ఎంజీఆర్ లత. ఆమె ఇటీవల తన జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Related image


ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి సీనియర్ హీరోలతో నటించిన లత.. ఆ తర్వాతి కాలంలో రజినీకాంత్, కృష్ణ, చిరంజీవి వంటి హీరోలతోనూ నటించారు. ఆమె కలసి నటించిన రజినీకాంత్ ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ రజినీకాంత్ ఇప్పటికీ తన పట్ల అదే గౌరవం చూపుతారని లత చెప్పుకొచ్చారు.

Image result for mgr latha with rajinikanth


రజినీకాంత్ తో మొదటి సినిమా చేసిన రోజులను లత గుర్తు చేసుకున్నారు. అప్పటికే లత బాగా పేరున్న హీరోయిన్.. రజినీకాంత్ అప్పుడప్పుడే కొత్తగా హీరోగా చేస్తున్నారు. ఎంజీఆర్ వంటి హీరోలతో చేసిన హీరోయిన్.. అందులోనూ లతకు బాగా కోపం అని రజినీకాంత్ కు చెప్పారట.



దాంతో లత సెట్లో ఉంటే కూర్చోవడానికి కూడా మొదట్లో రజినీకాంత్ భయపడేవారట. దూరం దూరంగా అంటీముట్టనట్టు ఉండేవారట. లతే చొరవ తీసుకుని ఎందుకు అలా ఉంటున్నారు.. ఫ్రీగా ఉండండి.. అని బెరుకుపోగొట్టారట. తన గురించి సెట్లో అందరూ చెప్పిన మాటలు గురించి తెలుసుకుని అదేం లేదని సర్దిచెప్పారట.


మరింత సమాచారం తెలుసుకోండి: