2017తో పోల్చుకుంటే 2018లో టాలీవుడ్ కు ఎక్కువ విజయాలు దక్కినా ఈఏడాది టాప్ హీరోలలో కొందరికి చేదు జ్ఞాపకాలే మిగిలాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లు నటించిన ‘అజ్ఞాతవాసి’ ‘నాపేరు సూర్య’ లు ఘోర పరాజయం చెందడంతో మరొక సినిమా చేయాలి అంటే బెదిరిపోయే పరిస్థుతులలో ఈ 2018 వారికి మరిచిపోలేని పీడకలలా మారిపోయింది. అయితే  మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు అంచనాలకు తగ్గట్లుగా సక్సస్స్ ను అందుకున్నాయి.
 రంగస్థలం
ఈ ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి  తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి’ తరువాత అతి పెద్ద విజయంగా నిలిచి రికార్డు సృష్టించింది. దర్శకుడు సుకుమార్ అద్భుతమైన మ్యాజిక్ కు ప్రేక్షకులు మైమరిచి పోయారు. 1980 నాటి పరిస్థితులకు అనుగుణంగా కధను రాసుకుని రాంచరణ్ లాంటి స్టార్ హీరోను ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న వ్యక్తి గా చూపించడంలో సుకుమార్ పూర్తి విజయం సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా 123 కోట్ల షేర్ రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. 
భరత్ అనే నేను
‘శ్రీమంతుడు’ తో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ మహేష్ లు కలసి మరోమారు అదే మ్యాజిక్ ‘భరత్ అనే నేను’ తో సాధించి ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా షేర్ ను రాబట్టి పరాజయాల బాటలో ఉన్న మహేష్ ను ట్రాక్ లోకి తీసుకువచ్చింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ దసరాకి సందడి చేసింది. రాయలసీమ ఫ్యాక్షన్ కథతో వచ్చిన ఈసినిమా త్రివిక్రమ్ స్థాయి సినిమాలతో సరిపోకపోయినా మొత్తానికి హిట్ ముద్ర వేయించుకుని ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. 
అరవింద సమేత వీరరాఘవ
అయితే ఈ ఏడాది టాప్ హీరోల రేసుకు సంబంధించి చిరంజీవి ప్రభాస్ ల సినిమాలు లేకపోవడంతో వారి సందడి లేదు. అయితే నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది టాప్ హీరోల స్థాయికి ఎదుగుదామని ‘క్రిష్ణార్జున యుద్ధం’ ‘దేవదాసు’ సినిమాల ద్వారా ప్రయత్నించినా అతడికి కూడ చేదు అనుభవమే మిగిలింది. ఇక నాగార్జున నటించిన ఆఫీసర్ ఘోరపరాజయంతో అతడికి కూడ సంవత్సరం కలిసి రాలేదు. దీనితో ఈ ఏడాది టాప్ హీరోలలో మహేష్ చరణ్ రామ్ చరణ్ లు మినహా అందరు ఈ సంవత్సరం అంతా అసంతృప్తితోనే కాలం గడిపారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: