ఈరోజు ప్రపంచం యావత్తు క్రిస్మస్ వేడుకలను అత్యంత ఆనందంగా జరుపుకుంటోంది. అయితే ఈ క్రిస్మస్ మెగా కుటుంబానికి కూడ మర్చిపోలేని క్రిస్మస్ గా మారింది. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ శ్రీజ దంపతులకు ఈరోజు ఉదయం పాప పుట్టిన విషయాన్ని అత్యంత ఆనందంతో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ట్విట్ చేసాడు.

ఈ విషయాన్ని మెగా అభిమానులకు షేర్ చేస్తూ కళ్యాణ్ దేవ్ ‘మా కుటుంబం మరిచిపోలేని క్రిస్మస్ పండుగను ఈరోజు జరుపుకుంటున్నాం. శ్రీజ కళ్యాణ్ దేవ్ ల బేబి2 బయటకు వచ్చేసింది’ అంటూ ట్విట్ చేసాడు కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ దేవ్ మొట్టమొదటి సినిమా ‘విజేత’ ఫెయిల్ అయినా అతడికి ముద్దుల కూతురు పుట్టడంతో ముగిసిపోతున్న ఈ సంవత్సరం కళ్యాణ్ దేవ్ కు మంచి జోష్ ను ఇచ్చింది అనుకోవాలి. 

శ్రీజకు ఇప్పటికే ఒక అమ్మాయి ఉన్న విషయం తెలిసిందే. తన చిన్న కూతురుకు కూతరు పుట్టింది అన్న విషయం తెలుసుకుని మెగా స్టార్ చిరంజీవి చాల ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో పండుగ వాతావరణం నెలకున్నట్లు టాక్. 

‘విజేత’ ఫెయిల్ అవ్వడంతో కళ్యాణ్ దేవ్ ను ఒక ప్రముఖ దర్శకుడు చేతిలో పెట్టి ఒక మంచి హిట్ సినిమాను తానే నిర్మించాలని చరణ్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికోసమే కళ్యాణ్ దేవ్ తన తదుపరి సినిమా బాధ్యతను అంతా మెగా కాంపౌండ్ పైనే పెట్టాడు. తనకు మరో మేనకోడలు పుట్టిన ఆనందంలో ఉన్న చరణ్ ఈ ఆనందంతో వచ్చే ఏడాది ఖచ్చితంగా కళ్యాణ్ దేవ్ కోరుకున్న ఒక హిట్ సినిమాను తీస్తాడని ఆశిద్దాం..  


మరింత సమాచారం తెలుసుకోండి: