తెలుగులో కొన్ని రకాలైన కాంబోలు, పాత్ర పోషణలకు యాంటీ సెంటిమెంట్ ఉంది. ఓ హీరో రెండు పాత్రలు వేస్తే సూప‌ర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ మూడు గెటప్పులతో ముందుకు వస్తే  మాత్రం చీదేసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. తొంబై దశకంలో చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు పెద్దగా విజయం సాధించలేదు. బాలయ్య మూడు పాత్రలతో చేసిన అధినాయకుడు కూడా ఫ్లాప్ అయింది. ఇక జై లవకుశ అంటూ జూనియర్ నటిస్తే అది కూడా పెద్ద హిట్ కాలేదు. మరి పౌరాణికాల్లో మాత్రం అన్న గారు వేసిన దానవీరశూరకర్ణ సూపర్ డూపర్ హిట్ అయింది. సొషల్లో ఆయన మూడు పాత్రలు చేసిన కులగౌరవం కూడా అంతగా హిట్ అవ్వలేదు.


ఇపుడు ఈ టాపిక్ అంతా ఎందుకంటే బాలయ్యతో బోయపాటి ఇలాంటి ప్రయోగం చేయబోతున్నారట. ఆయన బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి అనుకున్న స్టోరీలో మూడు పాత్రలు ఉంటాయట. అందులో తాత, తండ్రి, మనవడు ఇలా మూడింటినీ సమాంతరంగా బాలయ్య పోషిస్తారని టాక్ నడుస్తోంది. మరి బాలయ్య అయితే ఎపుడూ హిట్లు ఫ్లాప్స్ అన్నదాన్ని పెద్దగా చూసుకోరు. ఆయనకు నచ్చితే చేసేస్తారు. దాంతో బోయపాటి మూవీకి బాలయ్య ఒకే చెప్పారని అంటున్నారు.


పైగా ఈ ఇద్దరికీ మంచి సక్సెస్ రికార్డు ఉంది. సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ కాంబోలో వచ్చాయి. దాంతో హ్యాట్రిక్ కోసం ఇటు అభిమానులే కాదు, టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మధ్యన జరిగిన అన్న గారి బయోపిక్ ఆడియో వేడుకలో ఈ మూవీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందని ప్రకటించారు. సో రెండు నెలలు వైట్ చేస్తే మరిన్ని విశేషాలు ముందుకు వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: