టాలీవుడ్ లోకి ముకుందా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’లాంటి ప్రయోగాత్మక సినిమాలో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈ మద్య ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు.   మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. 
Image result for బాక్సర్ గా వరుణ్ తేజ్
ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడు.  కిరణ్ కొర్రపాటి ఇంతకుముందు  'మిస్టర్' , 'తొలిప్రేమ' సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సమయంలోనే వరుణ్ తేజ్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఆయనకి ఒక మంచి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఈ కథలోనే వరుణ్ తేజ్ ను బాక్సర్ గా చూపించనున్నాడు. ఎఫ్2 సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు జోడిగా మెహరీన్‌ నటిస్తోంది.
Image result for బాక్సర్ గా వరుణ్ తేజ్ antariksham
ఇక జనవరిలో ప్రారంభమయ్యే కొత్త సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ కు వెళ్ళిపోతున్నాడు. దీనికి సంబంధించిన కసరత్తులు కూడా మొదలుపెట్టాడు. అంతరిక్షం సినిమా కోసం కాస్త లావుగా కనిపించిన వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించాలంటే ఫిజిక్ చాలా ముఖ్యం కాబట్టి తక్కువ టైం ఉన్నప్పటికి కఠినమైన కసరత్తులతో వర్క్ అవుట్ చేస్తున్నట్టు సమాచారం.
Varun tej
అందుకు సంబంధించిన ఫోటోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాతో నిర్మాతగా, కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగాను ఈ సినిమాతో పరిచయమవుతున్నారు.  డెబ్యు డైరెక్టర్ గా తొలిప్రేమతో వెంకీ అట్లూరి ఎలాగైతే సక్సెస్ అందుకున్నాడో కిరణ్ కొర్రపాటి కూడా అదే తరహాలో హిట్ కొడతాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: