ఇలియానా దేవదాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి అప్పట్లో కుర్రకారుని మొత్తంగా దేవదాసులను చేసేసిన హాట్ బేబీ, తెలుగులో మంచి పొజిషన్లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసిన ఈ భామ ఈ మధ్యన రవితేజాతో అమర్ అక్బర్ ఆంధోనీ మూవీ చేసింది. టాలీవుడ్ అంటే తనకు ఎపుడూ ప్రేమేనని అంటున్న ఈ ముద్దు గుమ్మ తనకు తెలుగు సినిమాలకు గ్యాప్ అన్నది  ఎక్కడా లేదని క్లారిటీ ఇచ్చింది. 


రోటీన్ పాత్రలు వస్తే తానే నో చెప్పేదాన్నని, అందువల్లనే తెలుగులో కొంతకాలం పాటు కనిపించలేదని అంటోంది. తెలుగు లో తాను ఇప్పటికీ చేయడానికి రెడీనేనని, అయితే నచ్చే  పాత్ర దొరకాలి అంటోంది. మంచి పాత్ర దొరికితే రెమ్యునరేషన్ కూడా పెద్ద ప్రాబ్లం కాదని అంటోంది. అలా గతంలో తాను తక్కువ మొత్తానికి చేసిన సినిమాలూ ఉన్నాయని చెబుతోంది. ఇక తెలుగులో కోటి రూపాయల పెద్ద మొత్తాన్ని తీసుకున్న తొలి హీరోయిన్ తానేనని గర్వంగా చెప్తోన్న ఇలియానా తనకు లేటెస్ట్ మూవీలో చాలా ఎక్కువ ఇచ్చారన్నది వట్టి ప్రచారం మాత్రమేనని అంటోంది.


తాను బాయ్ ఫ్రండ్ తో ఉన్న మాట నిజనేమని, అయితే అదంతా తన పర్సనల్ అంటోంది. తన గురించి పుకార్లు రాసేవారంటే చికాకు అంటున్న ఇలియానా తనకు పెళ్ళి  అయిపోయిందని, గర్భవతిని అని కూడా రూమర్లు పుట్టించారని ఫైర్ అయింది. తాను పెళ్ళి చేసుకుంటే అది సంతోషమైన న్యూస్ అని, బయటకు ఎందుకు చెప్పకుండా ఉంటానని ఎదురు ప్రశ్నిస్తోంది. 


ఇంకో రెండేళ్ల వరకూ తన పెళ్ళి ప్రసక్తే లేదని ఇల్లీ బేబీ అంటోంది. ఇరవై ఏళ్ళకు దేవదాస్ మూవీ ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తాను పోకిరి మూవీని చేయకూడదని అనుకున్నానని, బలవంతంగా ఒప్పుకున్నా ఆ మూవీ తనకు స్టార్ స్టాటస్ తెచ్చిందని అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ మూవీ చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో ఎపుడు మళ్ళీ అంటే నేను ఎపుడూ రెడీనే అంటోంది. మరి ఆమెతో మూవీ తీసే నిర్మాతలే చెప్పాలన్న మాట ఆ సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: