ఒకప్పుడు హీరోయిన్లుగా మంచి ఫామ్ లో ఉండి..ఒక్కసారే కనుమరుగైన హీరోయిన్లు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ తో ఎంట్రీ ఇవ్వాలని తెగ కుతూహలపడుతున్నారు.  నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’సినిమాలో ‘లక్స్ పాపగా..లంచ్ కొస్తావా’ పాటలో హాట్ లుక్స్ తో కనిపించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది ఆశా సైని.  ఆ తర్వాత హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా దాదాపు  వెంకటేష్, రజినీకాంత్, రాజశేఖర్, జగపతిబాబు, విజయ్‌కాంత్, కార్తిక్, ప్రభు వంటి స్టార్ల సరసన నటించి అభిమానులను ఆకట్టుకుంది. తెలుగు లో మంచి ఫామ్ లో కొనసాగతున్న సమయంలోనే బాలీవుడ్ లోకి వెళ్లింది. 
Image result for lux papa lux papa
అక్కడ  ఫ్లోరా సైని గా పేరు మార్చుకుంది.  కానీ బాలీవుడ్ లో మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదు..అప్పటికే తెలుగు లో యంగ్ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆశాసైని కి ఛాన్స్ లు లేకుండా పోయాయి. దాంతో టీవీ డ్యాన్స్ షోలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించింది.  తాజాగా ఓ హాట్ వెబ్‌ సిరీస్‌లో సైని నటించింది.  ఇక బాలీవుడ్ లో హాట్ మూవీస్ తీయడంలో దిట్టా..ప్రముఖ ప్రొడ్యూసర్, దర్శకురాలు ఏక్తా కపూర్.  ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘గంది బాత్’కు మంచి స్పందన వచ్చింది.
Image result for ekta kapoor
ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘గంది బాత్ 2’ను నిర్మించారు. ఈ రెండో పార్ట్‌లో ఆశా సైని కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో సైని నగ్నంగా కనిపించనున్నట్లు సమాచారం.  మరి ఈ వెబ్ సీరీస్ సక్సెస్ అయితే మళ్లీ సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది  ఫ్లోరా సైని.  ఈ సందర్భంగా  ఫ్లోరా సైని మాట్లాడుతూ..ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు  అన్నదమ్ములు నాతో ప్రేమలో పడతారు.
Image result for ekta kapoor gandi baat
నా సన్నివేశాల్లో స్కిన్ షో‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హాట్ సన్నివేశాలను దర్శకుడు సచిన్ మోహిత్ రసవత్తరంగా చిత్రీకరించారని నేను భావిస్తున్నాను. శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను..ఆ పాత్రకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను అంటుంది  ఫ్లోరా సైని. 



మరింత సమాచారం తెలుసుకోండి: