టాలీవుడ్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా రూపొందుతోంది.  ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలు హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరిగాయి.  ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ తారలు, దర్శక, నిర్మాతలు పలువురు టెక్నీషియన్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు.  ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ చూస్తుంటే నిజంగా ఎన్టీఆర్ తమ కళ్ల ముందు ఉన్నట్లే అనిపిస్తుందని నందమూరి అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. 
Image result for ntr biopic audio launch balakrishna
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం  'కథానాయకుడు' సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అంటే ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఎదురు చూస్తున్నారు.
Image result for ntr biopic audio launch balakrishna
ఈ సందర్భంగా ఎన్టీఆర్ లుక్ తో వున్న బాలకృష్ణ 100 అడుగుల కటౌట్ ను హైదరాబాద్ - నిజాంపేట్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేశారు.  బాలకృష్ణ ‘ఎన్టీఆర్’బయోపిక్  ‘కథానాయకుడు’ లో కాషాయ వస్త్రంలో బాలకృష్ణ కటౌట్ ఏర్పాటు చేశారు. 
Image result for ntr biopic audio launch balakrishna
ఈ కటౌట్ చూస్తుంటే సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారు అర్ధం అవుతుంది.  ఎన్టీఆర్ గా బాలకృష్ణ ధరించిన వివిధ రకాల గెటప్స్ .. కీరవాణి సంగీతం .. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: