జబర్దస్త్ షో తో పాపులారిటీ ని సంపాదించిన రష్మీ అలాగే సుధీర్ వీరిద్దరూ కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. దీనికి తోడు జబర్దస్త్ షోలో సైతం పలువురు కమెడియన్లు వీరికి లింక్ పెడుతూ పంచులు పేలుస్తుండటంతో ప్రేక్షకుల్లో సైతం వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే గత ఇంటర్వ్యూల్లో రష్మి, సుధీర్ స్పందిస్తూ... తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, వృత్తి పరంగా క్లోజ్‌గా ఉంటాం తప్ప, తమ మధ్య అలాంటిదేమీ లేదని వెల్లడించారు.

నా కోరిక కూడా అదే, కానీ...

అయితే వారు చెప్పిన మాటలు చాలా మందికి నమ్మబుద్దికావడం లేదు. తాజాగా అభిమానులతో ట్విట్టర్ లైవ్ చాట్ చేసిన రష్మికి సుధీర్ గురించి ప్రశ్నలు చాలా ఎదురయ్యాయి. సుడిగాలి సుధీర్‌ను ఎందుకు అంతలా అసహ్యించుకంటున్నారు? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... ‘అలాంటి వారిని నేనుప్పుడూ అసహించుకోను. ఎందుకంటే వారు నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తారు' అని తెలిపారు. ఎలాంటి ప్రశ్నలు మీకు చికాకు తెప్పిస్తాయి? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... ‘పెళ్లికి సంబంధించిన, ఏజ్ రిలేటెడ్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు నచ్చదు' అన్నారు.

సుధీర్, ప్రధీప్.... వారిని వేరుగానే, అలాంటిది జరుగదు

రష్మి ఎవరి కోసం వెయిట్ చేస్తుందో... చివరకు సుధీర్‌కే దక్కుతుందేమో? అనే అభిమాని కామెంటుకు ‘‘చాలా రోజుల క్రితమే నా వెయింటింగ్ ముగిసింది. నా ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ గానే ఉంచాలనుకుంటున్నాను'' అని తెలిపారు. సుధీర్, ప్రదీప్ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్నకు ‘నా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్... వేర్వేరుగా ఉంటాయి. అందులో ఉండే వ్యక్తులు ఇందులోకి, ఇందులో ఉండే వ్యక్తులు అందులోకి రావడం జరుగదు' అని రష్మి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: