‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తరువాత బోయపాటి రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘వినయ విధేయ రామ’ వల్ల బయటకు చెప్పకపోయినా చరణ్ బోయపాటిల మధ్య దూరం పెంచింది అన్న గాసిప్పులు ఇప్పటికే ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి. ఈ విషయాలను చరణ్ బోయపాటిలు ఖండిస్తూ వస్తున్నా ఈమూవీకి సంబంధించి ఈమధ్య బోయపాటి తీసుకున్న ఒక నిర్ణయం చరణ్ కు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి.

‘రంగస్థలం’ మూవీ విడుదల తరువాత మొదలైన ఈమూవీ షూటింగ్ ఎక్కడా అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి పూర్తికాలేదు. బోయపాటి తన స్టైల్ కు భిన్నంగా ఈమూవీ షూటింగ్ లో చిత్రీకరణ ఆలస్యం చేయడంతో పాటు చరణ్ ‘సైరా’ పనుల బిజీ వల్ల అనేకసార్లు ఈసినిమా షూటింగ్ ను వాయిదా వేయించడంతో అన్నీ కలిసి ఈమూవీ నిర్మాణ పనులను బాగా ఆలస్యం అయ్యేలా చేసిందని వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈసినిమాలో 6పాటలను అనుకుంటే టైమ్ సరిపోవక పోవడంతో ఈమూవీలో కేవలం 4 పాటలు మాత్రమే ఉండేలా చేసి మిగతా రెండు పాటలను ఈమూవీ ఆడియో లిస్టు నుండి తొలిగించినట్లు టాక్. ముఖ్యంగా చరణ్ ఈమూవీ షూటింగ్ పూర్తి కాకుండానే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ లో పాల్గొనడం బోయపాటికి ఏమాత్రం నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈమధ్య కాలంలో బోయపాటి చరణ్ ల మధ్య మాటలు బాగా తగ్గాయని అంటున్నారు. ఈమూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈనెల 27న జరగబోతున్న నేపధ్యంలో చరణ్ బోయపాటిలు ఈ అభిప్రాయభేధాలు వల్ల అంటీ ముట్టనట్లు ఉంటారా లేకుంటే వారి అభిప్రాయ భేదాలు పక్కకు పెట్టి అసలు ఏమీ జరగనట్లు నటిస్తారా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్న ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సస్ పై ఈమూవీ తదుపరి క్రేజ్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: