జబర్దస్త్ షో తో పాపులారిటీ ని సంపాదించిన రష్మీ తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ ని సంపాదించింది. అయితే ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు అడిగినా విసుక్కోకుండా బోల్డ్‌గా రిప్లై చెప్పడం రష్మి స్టైల్. మంగళవారం అభిమానులతో చాట్ చేసిన రష్మికి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి రష్మి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్స్ ఇచ్చింది. కొందరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే...మరికొందరు సినిమాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించారు. డబ్బులిస్తే రాత్రికి వస్తారా? అంటూ కొందరు ప్రశ్నించగా దానికి రష్మి నుంచి ఊహించని సమాధానం వచ్చింది.

నాగబాబు టెడ్డీబేర్, స్వీట్ హార్ట్

2018 కూడా అయిపోతోంది... మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ.... నాకు పెళ్లి కంటే ముందు బేబీ కావాలి, త్వరలోనే అది జరుగుతుంది అని భావిస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చింది రష్మి. ఎవరైనా మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి రాత్రికి రమ్మంటే మీరు ఏం చేస్తారు? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ ‘అది అడిగే వ్యక్తిపై ఆధార పడి ఉంటుంది' అన్నారు.

 సెక్సువల్ రిలేటెడ్ అంశాలకు ఆదరణ ఎక్కువ

పెళ్లికి ముందే మీరు బేబీని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా ఏమిటి? అనగా.... రష్మి అవును అని సమాధానం ఇచ్చారు. తన ఫేవరెట్ డిష్ పచ్చి పులసు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. రాజమౌళి, శంకర్... ఈ ఇద్దరిలో ఉత్తమ చిత్రాలు, ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాలు తీసేది ఎవరు? అంటే ‘శంకర్ సర్' అని రిప్లై ఇచ్చారు రష్మి. అవకాశం వస్తే బాలీవుడ్లోకి వెళతాను అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  రాత్రికి వస్తారా? అలాంటి ప్రశ్నలకు మీరు బోల్డ్ ఆన్సర్ ఇచ్చారు. ఇలాంటి విషయాలను మీరు లైట్ తీసుకుంటారా? అని ఓ అభిమాని ప్రశ్నంచగా.... సెక్సువల్ రిలేటెడ్ అంశాలకు ఆదరణ ఎక్కువ, అందుకే మొహమాట పడకుండా సమాధానం ఇచ్చాను అని రష్మి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: