మరో వారంలో ముగియనున్న 2018 చాలమంది కొత్త హీరోయిన్స్ కు అదృష్టాన్ని ఇచ్చిన సంవత్సరంగా మారడమే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్స్ కొరతను తీర్చిన సంవత్సరంగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. అనేకమంది యంగ్ బ్యూటీస్ ఈ సంవత్సరం తాము నటించిన మొదటి సినిమాతోనే తమ ఇమేజ్ ని పెంచుకోగలిగారు. ఈ లిస్టులో మొట్టమొదటిగా పేర్కొనవలసిన హీరోయిన్ రష్మిక ఈ ఏడాది ఆమె నటించిన తొలి చిత్రం ‘ఛలో’ తో మంచి క్రేజ్ ను తెచ్చుకుని ఆతరువాత ఆమె నటించిన ‘గీత గోవిందం’ సక్సస్ తో రష్మిక టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. 

‘భరత్ అనే నేను’ తో చిత్రం టాలీవుడ్‌ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన తొలి చిత్రంతోనే టాప్ హీరోల దృష్టిని ఆకర్షించి టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం ఆమె అనేక క్రేజీ మూవీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ టాప్ హీరోయిన్స్ కు చుక్కలు చూపెడుతోంది. వీరందరూ ఒక ఎత్తు అయితే తన తొలి చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’ తో సంచలన హీరోయిన్ గా మారిపోయిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్. ఎలాంటి ఎక్స్ పోజింగ్ సీన్స్ లో అయినా ఎటువంటి మొహమాటం లేకుండా నటించే ఈమె క్రేజ్ ప్రస్తుత తరం ప్రేక్షకులలో బాగా ఉంది.  

ఈ ఏడాది టాలీవుడ్‌ కి పరిచమైన మరో బ్యూటీ ప్రియాంక జవల్కర్ అనంతపురానికి చెందిన తెలుగు అమ్మాయి ఐనప్పటికీ ప్రస్తుతం ముంబాయ్ లో సెటిల్ అయి అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ ప్రముఖ మోడల్ గా మారిన ఈమె నటించిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’ తో అందరి దృష్టీ ఆకర్షిస్తోంది. వీరితో పాటు ‘గూఢచారి’ చిత్రంతో ఒక మెరుపు మెరిసిన శోభిత దూళిపాళ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమె స్పీడ్ కు ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్య పోతోంది. లిప్ లాక్ సీన్స్ లో నటించే విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పని ఈమెకు పేరు బాగా వచ్చినా అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. 

అయితే చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో అందరి దృష్టిలో పడింది. ఈసినిమాలో నటించిన సుధీర్ బాబు కంటే ఈమెకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. వీరితోపాటు తన గ్లామరస్ లుక్స్‌తో ‘సవ్యసాచి’ సినిమాలో నటించి అందర్నీ ఆకర్షించిన నిధి అగర్వాల్‌ కు చాల అవకాశాలు వస్తున్నాయి. వీరే కాకుండా ‘చి.ల.సౌ’ హీరోయిన్ రుహానీ శర్మ ఇటీవల విడుదలైన రామ్ గోపాల్ వర్మ ‘భైరవగీత’ హీరోయిన్ ఇర్రా మోర్‌ ఇలా ఎందరో తమ నటనతో అదేవిధంగా తమ గ్లామర్ ఎక్స్ పోజింగ్ తో అవకాశాలు అంది పుచ్చుకుంటూ వచ్చే ఏడాది కూడ తమ హవా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: