ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త దర్శకు, నిర్మాతలు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  కొత్త కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు తీస్తున్న చిత్రాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి.  అర్జున్ రెడ్డితో సంపత్ వంగా, ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి ఇలా పలువురు దర్శకులు కొత్త నటులతో చిత్రాలు తీసి మంచి విజయాలు సాధించారు.  ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నూతన దర్శకుడు కోవెర.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో  రచయితగా .. దర్శకుడిగా నేనేంటన్నది నిరూపించుకోవాలని అనుకున్నాను.
Image result for u movie director kovera
కానీ అవకాశం రావడమనేది అంత తేలిక కాదనేది నాకు అర్థమైంది. దాంతో నేనే నిర్మాతగా, దర్శకుడిగా మారి ‘యూ’చిత్రాన్ని తీశానని అన్నారు.  ఇండస్ట్రీలో నాకు ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని..ఓ నిర్మాత నాతో చిత్రాన్ని తీయడానికి ఒప్పుకున్నారు. అంతే కాదు రూ.60 వేట అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చారు. అంతే నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్లకు చెప్పి తెగ ఆనందపడ్డాం. మరుసటి రోజు బ్యాంక్ కి వెళ్లి చెక్ మార్చుకుందామని తీసేలోపు అది చిరిగిపోయింది.  బ్యాంకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ నిర్మాతకి ఫోన్ చేశాను. 'చెక్ కాపాడుకోలేనివాడివి .. సినిమాను ఎలా కాపాడతావయ్యా' అంటూ ఆయన ఫోన్ పెట్టేశాడు.  అంతే నా పరిస్థితి తల్చుకుంటే నాకే జాలి వేసింది..కన్నీళ్లు ఆగలేదు..అలాగే ఇంటికి వెళ్లానని అన్నారు యువ దర్శకుడు కోవెర. 


మరింత సమాచారం తెలుసుకోండి: