సంక్రాంతి  సీజన్ ను క్యాష్ చేసుకోవాలని ప్రతి ఏడాది చాలా సినిమాలు  ప్రయత్నిస్తాయి.  అయితే  ఈసారి సంక్రాంతికి మూడు సినిమాలకు మించి రావడంలేదు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ‘ఎఫ్ 2’ ‘వినయ విధేయ రామ’ సినిమాలు ఇప్పటికే షెడ్యూలు అయ్యాయి. రజనీకాంత్ ‘పెట్టా’ కూడ లైన్ లో ఉంది.  దీనితో అఖిల్ సినిమా ‘మిస్టర్ మజ్ను’ కళ్యాణ్ రామ్ సినిమా ‘118’ జనవరి ఆఖరి వారానికి వెళ్ళాయి. అలాగే నిఖిల్ ‘ముద్ర’ కూడా జనవరి ఆఖరు వారంలో ఉంటుంది అని అంటున్నారు.  ఇదేసమయానికి  కోలీవుడ్  హీరో కార్తీ ‘దేవ్’ కూడా రాబోతోంది.
NTR Biopic Trailer: Nandamuri Balakrishna Wonderfully Presents The Journey Of NTR, Vidya Balan Looks Fantastic
అయితే జనవరి నెలాఖరున విడుదల కావలసిన ఈసినిమాలు అన్నింటికి ఎన్టీఆర్ బయోపిక్  రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ మొదలలైనట్లు సమాచారం.  ఎన్టీఆర్ బయోపిక్ సినిమా హిట్ అయితే కనీసం ఆసినిమా మ్యానియా మూడువారాలు ఉంటుంది. అయితే కనీసం నెలరోజులు కూడ అవకుండానే ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి మొదటివారంలో విడుదలకాబోతోంది. దీనితో ఎన్టీఆర్ బయోపిక్ హడావిడి జనవరి 9నుంచి ఫిబ్రవరి 15వరకు ఉండే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 
NTR Biopic New Poster: Nithya Menen's Look As Mahanati Savitri in Nandamuri Balakrishna's Film REVEALED!
అయితే ఇది అంతా ఎన్టీర్ బయోపిక్ ఊహించిన విధంగా హిట్ అయితే ఉండే పరిస్థితి. దీనితో   జనవరి ఆఖరివారంలో ఫిబ్రవరి ఫస్ట్ ప్రాంతంలోరిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు అన్నింటికి అయోమయ పరిస్థితులు ఏర్పడటం ఖాయం అని అంటున్నారు. ఇది ఇలాఉండగా ఈమూవీలో 12 రీమిక్సు పాటలు 63 గెటప్పులతో ఎన్టీఆర్ పాత సినిమాలలోని బిట్లు అన్ని కలిపినవిషయాలు  గంటన్నర పైగా ఉంటుంది అన్నవార్తలు వస్తున్నాయి. దీనితో ఎన్టీఆర్ జీవితం ఎక్కువ విషయాలు చెప్పకుండా కేవలం రీమిక్సులతో ఎక్కువభాగం చూపిస్తే మాత్రం ఈమూవీ పరాజయం చెందే ఆస్కారం ఉంది అని అంటున్నారు.  
ntr
ఈమూవీ తొలిభాగం ముగింపు విషయంలో ఇప్పటికి కొంత కన్ఫ్యూజన్ బాలయ్య క్రిష్ ల మధ్య ఉంది అన్నవార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కుసంబంధించి  నిమ్మకూరులో నాటకాలతో మొదలై  ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజీనామా సినిమాల్లో ప్రవేశం షూటింగ్ లు ఇంట్లో సరదాలు ఇంతలో  ఆపై అరవైఏళ్లు రావడంతో రాజకీయ జీవితంలోకి వెళ్లాలని అనుకోవడం అందరూ వద్దని వారించడం ఈలోగా కేంద్రం వద్ద తెలుగువాడికి అవమానాలు జరగడంతో  ఒక తెలుగువాడిగా రగిలిపోయిన ఎన్టీఆర్ బీచ్ ఒడ్డున సంఘర్షణపడుతూ ఎన్టీఆర్ నడుస్తున్న సీన్ తో ఈ బయోపిక్ ప్రధమ భాగం ముగుస్తుందని సమాచారం . ఏదిఏమైనా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈబయోపిక్  చాలా సినిమాల తలరాతను మారుస్తుంది అన్నప్రచారం జరుగుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: