ఎపుడూ రొటీన్ అంటే కుదరదు, ఎప్పటికపుడు కొత్తదం ఉండాలి అంటోంది నందిని శ్వేత. ఆమె తెలుగులో ఎక్కడికిపోతావు చిన్న వాడా మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ మూవీలో చక్కని నటనతో మంచి మార్కులు తెచ్చుకున్న నందిని కేవలం ఆట బొమ్మగా ఉంటే హీరోయిన్ కాదని, నటనకు స్కోప్ ఉండాలని అంటోంది. అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ అమ్మడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది.


ఈ నెల 28న ధియేటర్లలోకి రాబోతున్న బ్లఫ్ మాస్టర్ లో హీరోయిన్ గా నటించిన నందిని ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది. తనది ఈ మూవీలో అమాయకమైన ఆడపిల్ల పాత్రగా చెప్పుకుంది. నటనకు మంచి చాన్స్ ఉందని, అందుకే ఈ సిన్మా చేశానని అంటోంది. తమిళ్ రిమేక్ గా వచ్చిన ఈ మూవీ ని తెలుగు నేటివిటీకి తగినట్లుగా డైరెక్టర్  గోపీ గణేష్ తీర్చిదిద్దారని చెబుతోంది. తెలుగులో ఇది మూడో సినిమా. మొదటి సినిమా ఎక్కడి పోతావు చిన్నవాడా సమయంలో చెప్పినట్టే వైవిధ్యమైన పాత్రలకే ఓకె చెబుతున్నానని అంటోంది. 


సినిమా బాగా వచ్చిదని అంటున్న నందిని బ్లఫ్ మాస్టర్ విడుదల కోసం ఆతృతగా చూస్తున్నాని చెప్పింది.  ఈ ఏడాది తన  కెరీర్ అద్భుతంగా సాగడంపట్ల హ్యాపీగా ఉందని,  తమిళ, తెలుగు భాషల్లో కలిపి పదికి పైగా సినిమాలు చేశానని నందిని అంటోంది. మరో ఆరేడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం కన్నడలో హీరో యాష్‌తో కిరాతక అనే సినిమా చేస్తున్నా. దాంతోపాటు తెలుగులో ప్రేమకథాచిత్రం 2, కల్కి, రక్షణ, అభినేత్రి 2 సినిమాలు చేస్తున్నాను. నాకూ హారర్ జోనర్ చాలా ఇష్టం అంటున్న నందిని కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: