"మణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ" పేరుతోనే గుండెలే కాదు దేహం జలధరిస్తుంది భారత జాతికి. అలాంటి చరిత్రను తెరపైకి తీసుకు రావటంలో నిపుణుల కృషి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. మణికర్ణిక చూసిన తర్వాత తనను విమర్శించే వాళ్ళ నోళ్ళు మూత పడతాయని ఇక వారు మౌనాన్ని ఆశ్రయిచక తప్పదని కథానాయిక కంగనా రనౌత్‌ అంటున్నారు. 
Image result for manikarnika the queen of jhansi

తొలి భారత స్వతంత్ర సమరాంగణాన కదన రంగంలో దూకిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా చిత్రీకరణ జరుపుకున్న చిత్రమిది. కంగన టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించి మద్యలో ఏవో కారణాలతో వదిలేశారు. కథానాయకి కంగన రనౌత్ తన దర్శకత్వంలో సినిమా మిగిలిన బాగాన్ని అనేక వివాదాల మద్య పూర్తిచేశారు   
Image result for manikarnika the queen of jhansi
ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని ఉద్దేశించి కంగన రనౌత్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. సినిమా తప్పక అన్నీ వర్గాల ప్రజల కు నచ్చుతుందంటూ విమర్శకుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నా గురించి, నా చిత్రాల గురించి ఏరోజూ సానుకూలంగా మాట్లాడని వారు ‘మణికర్ణిక’ చూసిన తర్వాత మౌనాన్ని ఆశ్రయించక తప్పదని అలాగే నన్ను, నా నటనను మెచ్చి ప్రశంసిస్తూ ఉండే వారిని అడ్డుకోలేరు అని ఆమె చాలా ఆత్మవిశ్వాసం తో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

నోర్మూయిస్త బాంచన్! మణికర్ణిక చూస్తే నాపై వ్యాఖ్యలు చేసే అందరి నోళ్ళూ? మూతపడతాయ్! కంగన రనౌత్


Image result for manikarnika the queen of jhansi
"మణికర్ణిక" చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని కూడా కంగన రనౌత్‌ చూసుకున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ కు లభించిన ఆదరణ అపూర్వం. దీని గురించి కంగన వివరిస్తూ, మా చిత్ర యూనిట్ పడిన కష్టం ఫలించబోతోంది. మొదట దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలంటే  భయపడ్డాను, కానీ తర్వాత నటిగా, దర్శకురాలిగా ఆ పాత్రలకు న్యాయం చేయగలిగానని అనిపిస్తుంది. ఈ సినిమా విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా సమయంలో రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గారు నాకు నైతిక మద్దతునిచ్చి చాలా సహాయం చేశారు. నా తరవాతి సినిమా కథను కూడా ఆయనే సిద్ధం చేస్తున్నారు అని కంగనా రనౌత్‌ అన్నారు.

Image result for kangana in saree

మరింత సమాచారం తెలుసుకోండి: