బాహుబలి సిరీస్ తరువాత అనుష్క ఇంత వరకు ఏ సినిమా లో నటించలేదు. అయితే అనుష్క న్యూ లుక్ త్వరలో రాబోతుందని తెలుస్తుంది. దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న ఆమె త్వరలో కోన వెంకట్ నిర్మాణంలో వచ్చే ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ గ్యాపులో ఆమె తన ఫిజిక్, లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ సరికొత్త అవతారంలోకి మారిపోయినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా అనుష్క మీడియాకు కూడా చిక్క లేదు.

సన్నగా మెరుపు తీగలా ఉంటుందా?

ఆమె లుక్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో క్రిస్మస్ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు కోన వెంకట్. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తన ట్విట్టర్ ద్వారా అనుష్కకు సంబంధించిన ఓ ఫోటో కోన వెంకట్ షేర్ చేశారు. అయితే ఇది అనుష్క లేటెస్ట్ లుక్ కాదు. మనం ఇప్పటి వరకు చూసిన అనష్క ఫోటోయే అది. తనకు ఈ లుక్ కూడా ఇష్టమే, కానీ... ‘మా సినిమాలో అనుష్క లుక్ విషయంలో సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నాం.

నెక్ట్స్ మూవీ వివరాలు

అది ఆమె కెరీర్లోనే ది బెస్ట్ లుక్‌గా ఉండబోతోంది' అన్నారు. దీంతో త్వరగా అనుష్క లుక్ విడుదల చేయాంటూ కోన వెంకట్‌కు అభిమానుల నుంచి విజ్ఞప్తులు వెళ్లువెత్తాయి. సూపర్' సినిమా ద్వారా అనుష్క హీరోయిన్‌గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అపుడు అనుష్క సన్నగా... మెరుపు తీగలా సెక్సీ లుక్‌తో ఆకట్టుకుంది. మళ్లీ అలాంటి లుక్‌లోకి అనుష్క మారబోతోందా? అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: