సీనియర్ హీరోయిన్స్ లో ప్రధమ స్థానంలో కొనసాగుతున్న అనుష్క నయనతారలు మినహా మిగతా సీనియర్  హీరోయిన్స్ అంతా విఫలం కావడంతో కాజల్ తమన్నా ఇలియానలకు ఇక కాలం చెల్లినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాదాపు ఒక దశాబ్దం పాటు క్రేజి హీరోయిన్స్ గా టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ ముగ్గురికీ ముగుస్తున్న 2018 ఒక పీడ కలలా మారింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  

‘మగధీర’ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ లోకి వెళ్లిపోయిన కాజల్ ప్రతి ఏటా హిట్స్ కొడుతూనే ఉంది. కానీ ఈఏడాది మాత్రం ఆమెకు ఒక్క విజయం కూడ దక్కలేదు. తెలుగులో ఆమె చేసిన ‘అ’ ‘ఎమ్మెల్యే’ ‘కవచం’ సినిమాలు మూడూ ఫ్లాప్ మూవీలుగా మారడంతో ఇక ఆమె కెరియర్ చివరి దశకు చేరుకున్నట్లే అన్న కామెంట్స్ వస్తున్నాయి.   

మిల్కీ బ్యూటీగా పిలిపించుకుంటూ దాదాపు 12సంవత్సరాలు ఇండస్ట్రీని షేక్ చేసిన తమన్నా  పరిస్థితి కూడ అయోమయంగానే ఉంది. ఈసంవత్సరం ఈమె నటించిన ‘నా నువ్వే’ ‘నెక్ట్ ఏంటి’ సినిమాలు ఘోర పరాజయాలుగా మారాయి. ఇక రవితేజ పుణ్యమా అని అవకాశాన్ని అందుకుని మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడదామని  ప్రయత్నించిన ఇలియానాకు కూడ తీవ్ర పరాభవం ఎదురైంది. ఆమె నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫెయిల్ అవడంతో ఆమెకు ప్రయత్నించినా మరో అవకాశం వచ్చే ఆస్కారం లేదు. 

ఇదే లిస్ట్ లో కోలీవుడ్ హీరోయిన్స్ శృతి హాసన్ హన్సికలు కూడ కొనసాగుతున్నారు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించినా శృతి హాసన్ కు తెలుగులో అవకాశాలు లేకపోవడం సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఒకప్పుడు యూత్ చేత యాపిల్ బుగ్గల సుందరి అంటూ ముద్దుగా పిలిపించుకున్న హాన్సిక పేరును కూడ ఇంచుమించు హీరోలు దర్శక నిర్మాతలు మర్చిపోయారు. సంవత్సరానికి కనీసం ఒక అరడజను మంది క్రేజీ హీరోయిన్స్ సక్సస్ అవుతున్న నేపధ్యంలో ఇక రానున్న రోజులలో సీనియర్ హీరోయిన్స్ కు కష్టకాలమే ఎదురౌతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: