అసలేమాత్రం పరిచయం లేని కుర్రాడు వచ్చి బాక్సాఫీస్ పై వీర విహారం చేస్తుంటే అందరు చూస్తూ ఉండిపోతున్నారు. ఇంతకీ ఎవరా కుర్రాడు అంటే ఇంకెవరు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అని అంటున్నారు. కన్నడలో ఆల్రెడీ సూపర్ హిట్ ట్రాక్ లో ఉన్న యశ్, ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సినిమా సంచలనాలు సృష్టిస్తుంది.


రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడంతో పాటుగా సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. కన్నడ సినిమానే అయినా తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒకేసారి రిలీజైంది కె.జి.ఎఫ్. ఈ సినిమా తెలుగులో వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతుంది. బాలీవుడ్ లో కూడా కె.జి.ఎఫ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. 


ఇప్పటివరకు హిందిలో కె.జి.ఎఫ్ 19 కోట్ల దాకా వసూళు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హిందిలో తొలి రోజు 2.10 కోట్లు మాత్రమే రాబట్టిన కె.జి.ఎఫ్ నిన్న బుధవారం కూడా 2.60 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. పోటీగా షారుఖ్ ఖాన్ జీరో సినిమా వచ్చినా బాలీవుడ్ లో కె.జి.ఎఫ్ మంచి వసూళ్లు రాబడుతుంది.


జీరో సినిమాకు ఫ్లాప్ టాక్ రాగా ఇప్పుడు దేశమంతటా కె.జి.ఎఫ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ వసూళ్లు చూస్తుంటే యశ్ కూడా నేషనల్ స్టార్ గా ప్రమోట్ అయ్యాడని చెప్పొచ్చు. తెలుగులో యశ్ ఆల్రెడీ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రానున్న రోజుల్లో డైరెక్ట్ తెలుగు సినిమా చేసినా చేస్తాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: