తమిళ చిత్ర పరిశ్రమలో అభిమానుల ఆరాద్య దైవం సూపర్ స్టార్ రజినీకాంత్.  ఆయన నటించిన సినిమాలు వస్తున్నాయంటే అక్కడ అభిమానులకు ఆనందానికి అవధులు ఉండవు..వారం రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తుంటారు. అయితే లింగ, కబాలి, కాలా సినిమాలతో వరుసగా ఫ్లాపులు వస్తున్నా..ఈ మద్య శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమాలో నటిస్తున్నారు రజినీకాంత్. 
Related image
త్వ‌ర‌లో మురుగ‌దాస్‌తోను ఓ చిత్రం చేయ‌నున్నాడు.  ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.  అమెరికాలలో తన కుటుంబ సభ్యులతో  క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు రజినీకాంత్.  ఈ సందర్భంగా తన అల్లుడు ధనుష్ తో కలిసి సరదా సరదాగా గడిపినట్లు కనిపిస్తుంది.   
Image result for rajinikanth family america
రజినీకాంత్ అల్లుడు అయిన ధనుష్ నటుడు, దర్శకుడు, నిర్మాత, సింగర్ గా అన్ని రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు.  మామ ఇమేజ్ ని ఏమాత్రం వాడుకోకుండా తన స్వశక్తితో తమిళ నాట మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ధనుష్. 
Related image
ఈ మద్య ధనుష్ నటించిన ‘మారి2’సినిమా తమిళ నాట మంచి స్పందన వచ్చింది. ధ‌నుష్ త‌న ట్విట్ట‌ర్‌లో హ్య‌పీ హాలీడేస్ అనే కామెంట్ పెట్టి త‌న మామ ర‌జ‌నీకాంత్‌తో దిగిన ఫోటోని షేర్ చేశాడు.  వీరిద్దరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: