ఓ సూపర్ కాంబినేషన్ లో సినిమా అంటే సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఊర మస్ డైరక్టర్ తో అదే రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో తోడైతే ఎలా ఉంటుంది అంటే ఇంకెలా సరిగ్గా వినయ విధేయ రామ సినిమాలా ఉంటుందని చెప్పేయొచ్చు. బోయపాటి శ్రీను, చరణ్ కాంబినేషన్ అనగానే సినిమా అదరగొడుతుందని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్.


అయితే టైటిల్ వినయ విధేయ రామ అని పెట్టి అందరికి షాక్ ఇచ్చిన బోయపాటి రాముడు వినయుడు, విధేయుడే కాదు తేడా వస్తే విధ్వంసం సృష్టిస్తాడని అసలు కథని ట్రైలర్ లో చూపించాడు. ట్రైలర్ లో చరణ్ అదరగొట్టాడు అన్న మాట చాలా చిన్నదే అవుతుంది. ఊర మాస్ ప్రియులకు విందు భోజనం అందించేలా వినయ విధేయ రామ ట్రైలర్ వచ్చింది. గురువారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కె.టి.ఆర్ వివిఆర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 


ఈ సినిమా ట్రైలర్ లో ఎక్కువగా ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయో చూపించాడు. ఫ్యామిలీ మీద ఈగ కూడా వాడనివ్వని చిన్నోడుగా చరణ్ కనిపిస్తాడు. ట్రైలర్ చివరలో ఒంటి నిండా టాటూలతో విలన్ ను అలా గుంజుకొస్తున్న సీన్ చూస్తే అబ్బో రంగస్థలం తర్వాత రాం చరణ్ రచ్చ ఈ సినిమా కొనసాగించేలా ఉంటుందని చెప్పొచ్చు.


డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే చాలు సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చెప్పేయొచ్చు. సంక్రాంతి బరిలో దమ్ము చూపించేందుకు వస్తున్న చరణ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: