రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో మిగతా అంశాలు పక్కన పెడితే రామ్ చరణ్ ఒక సీన్ లో లుక్ మాత్రం అభిమానులను అలరిస్తుంది. రామ్ చరణ్ హల్క్ బాడీతో, ఛాతీ నిండా టాట్టూలతో డబ్ల్యు, డబ్ల్యు..డబ్ల్యు లుక్ లో కనిపించాడు. దీనితో చరణ్ అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . 

Image result for vinaya vidheya rama trailer

రెజ్లింగ్ సీన్లు ఇష్టంగా చూసే జనాలకు రామ్ చరణ్ లుక్కు కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ట్రయిలర్ మరీ అద్భుతంగా వుందని చెప్పడానికి ఏమీ లేదు. మరీ పేలిపోయేంత డైలాగులు కూడా లేవు. ఒకటి రెండు డైలాగులు ఓకె అనేలా వున్నాయి. 'ఒక్కనాకొడుక్కి ట్రయినింగ్ లేదు. ట్రయినింగ్ వుంటే టైమింగ్ లేదు, సరైన మగాడు ఒక్కడు కూడా తగల్లేదు' అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగు అభిమానులకు బాగానే వుంటుంది.

Image result for vinaya vidheya rama trailer

టోటల్ గా ట్రయిలర్ మొత్తం హీరో-విలన్ల మధ్య సంఘర్షణ మీదే దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. హీరోయిన్ ను ఒక్క సెకండ్ చూపించారు. డ్యూయట్ ను ట్రయిలర్ లోకి టచ్ చేయలేదు. మితిమీరిన హింస ట్రయిలర్ నిండా పరుచుకుంది. అది చూస్తుంటే బోయపాటి రాను రాను తన మాస్ బ్రాండ్ రికార్డును తానే అధిగమించాలని చూస్తున్నట్లుంది. మొత్తానికి ట్రైలర్ కొన్ని వర్గాల వారికి మాత్రమే నచ్చే విధంగా ఉందని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: