రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఆడియో లాంచ్ నిన్న అంగ రంగ వైభవంగా జరిగింది. అయితే ఈ చిత్రంలో నటి స్నేహ రామ్ చరణ్ పెద్ద వదిన పాత్రలో నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆమె మాట్లాడుతూ... 4 సంవత్సరాల తర్వాత నేను ఈ మూవీ చేస్తున్నాను. ఇది కంబ్యాక్ సినిమాగా చెప్పుకొచ్చు. కంబ్యాక్ ఫిల్మ్ ఇంత పెద్దదిగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. 

Image result for vinaya vidheya rama trailer

ఎన్నో సినిమాలు చేశాను కానీ చిరంజీవిగారితో చేయలేదు. ఆయనతో నటించాలనేది నా డ్రీమ్. అయితే నాకు రామ్ చరణ్‌తో కలిసి చేసే అవకాశం వచ్చింది. ఇది నాకు దక్కిన గొప్ప అవకాశం అన్నారు స్నేహ. రామ్ చరణ్ లాంటి వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. అతడు స్పాంటేనియస్ యాక్టర్ కూడా. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొదటి రోజు షూటింగుకు వెళ్లినపుడు అతడి బిహేవియర్ ఎలా ఉంటుందో..? అనుకున్నాను. కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అర్థమైందని స్నేహ చెప్పుకొచ్చారు. 

రామ్ చరణ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అనుకున్నా

బోయపాటిగారు నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నపుడు సరిగా చేయగలనో లేదో అనే నామీ నాకే నమ్మకం లేదు. కానీ ఆయన నువ్వు తప్పకుండా ఈ పాత్ర చేయగలవు అని ధైర్యం చెప్పారు. ఆయన ప్రోత్సాహం వల్లనే ఈ పాత్ర బాగా చేయగలిగాను అన్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి మాట‌లు: య‌ం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీ: రిషి పంజాబి, ఆర్థ‌ర్ ఎ.విల్స‌న్‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.వై.ప్ర‌వీణ్‌కుమార్‌, కో ప్రొడ్యూస‌ర్‌: డి.క‌ల్యాణ్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను.  

మరింత సమాచారం తెలుసుకోండి: