వాళ్ళిద్దరూ రాజకీయ నాయకులు.. కానీ ఇద్దరి పార్టీలు వేరు. ఒకే వేదికపై కలిశారు. గత అనుభవాలు నెమరేసుకున్నారు. వారిద్దరే చిరంజీవి, కేటీఆర్. వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన ఈ ఇద్దరూ రాజకీయ నాయకులూ ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు.

Image result for vinaya vidheya rama pre release event

ప్రత్యేకించి చిరంజీవి అయితే కేటీఆర్ ను ఆకాశానికెత్తేశారు. ‘కేటీఆర్‌ రాకతో ఈ కార్యక్రమానికి ఓ నిండుదనం వచ్చిందన్నారు మెగాస్టార్. కేటీఆర్ తానూ బెంచ్‌ మేట్స్‌ అంటూ అసెంబ్లీ రోజులు గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ అసెంబ్లీలో ఒకే సమయంలో అడుగుపెట్టారట.

Image result for vinaya vidheya rama pre release event

కేటీఆర్ చాలా మృదుభాషి అంటూ చిరంజీవి కితాబిచ్చారు. కేటీఆర్ అప్పట్లోనే వినయ విధేయ రామ అనిపించుకున్నారని సెటైర్ వేసారు. అయితే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే సమయంలో మాత్రం మాటల తూటాలతో ప్రత్యర్థుల నోళ్లు మూయించే డైనమిజం ఉన్న నాయకుడు కేటీఆర్ అంటూ మెచ్చుకున్నారు.

Image result for vinaya vidheya rama pre release event

అంతే కాదు.. కేటీఆర్ అనేక అంతర్జాతీయ వేదికలపై అత్యద్భుతంగా మాట్లాడి శెభాష్‌ అనిపించుకున్నారన్నారు. పనిలో పనిగా కేటీఆర్ కు కొత్త అర్థం కూడా చెప్పేశారు మెగాస్టార్.. అదేంటంటే.. కేటీఆర్‌ అనే మూడక్షరాలకు... డేరింగ్, డాషింగ్‌, డైనమిక్‌ అని వరించారు చిరంజీవి. మొత్తానికి యువ నాయకుడిని మెగాస్టార్ బాగానే పొగిడేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: