నిన్న జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి లుక్ ను చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపించే చిరంజీవి ముఖంలో తీవ్ర అలసట కనిపించింది. దీనికితోడు చిరంజీవి సన్నబడటంతో చిరంజీవి చరణ్ లు అన్నదమ్ములుగా కనిపిస్తున్నారు అంటూ ఈ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు కూడ కామెంట్స్ చేసారు. 
 తొమ్మిదేన్నర ఏళ్ల తర్వాత అవకాశం
ఇంతవరకు బాగానే ఉన్నా చిరంజీవి ముఖానికి సంబంధించి లుక్ లో అంత అలసట ఎందుకు కనిపించింది అన్న కోణంలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా చిరంజీవి ‘సైరా’ లోని ఫైట్ సీన్స్ కోసం చాల కష్టపడుతున్నాడు. డూప్ లేకుండా సహజత్వం కోసం ఈ వయసులో కూడ చిరంజీవి ఈసినిమాకు సంబంధించిన భారీ ఫైట్ సీన్స్ లో నటించడం వల్ల ముఖంలో ఈ అలసట స్పష్టంగా కనిపించింది అంటూ అభిప్రాయపడుతున్నారు. 
 రాంచరణ్ అలా సెట్ చేశాడు
దీనికితోడు గత నాలుగు నెలలుగా చిరంజీవి తన బరువును తగ్గించు కోవడం కోసం చాల ఖచ్చితమైన డైట్ ను అనుసరించడమే కాకుండా గంటల కొద్ది నిపుణుల పర్యవేక్షణలో ఎక్స్ సైజ్ లు చేయడం వల్ల కూడ ఇలాంటి అలసట చిరంజీవి ముఖంలో కనిపించి ఉండవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఇలా ఉండగా నిన్నటి ఫంక్షన్ లో చిరంజీవి తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటన చేయడంతో మరి కొన్ని సందేహాలు మొదలయ్యాయి.
అభిమానులపై మీమాంస ఉండేది
ఇప్పటి వరకు ‘సైరా’ షూటింగ్ ముగిసాక చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడు అంటూ వార్తలు కూడ వచ్చాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు చిరంజీవి 152వ సినిమాగా త్రివిక్రమ్ మూవీ ప్రకటన రావడంతో కొరటాల చిరంజీవిల మూవీ పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు నిన్నటి ఫంక్షన్ లో కొరటాల కనిపించక పోవడంతో ఈవిషయం పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: