తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన జోష్ కొనసాగిస్తున్నారు.  స్టార్ డైరెక్టర్ శంకర్, రజినీ కాంబినేషన్ లో వచ్చిన 2.0 సూపర్ హిట్ అయ్యింది.  ఇప్పటి వరకు రూ.800 కోట్లు కలెక్షన్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘పెట్టా’సినిమాలో నటించారు రజినీకాంత్.  ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, టీజర్, లికర్ సాంగ్స్ సోషల్ మీడియాలో భారీ అంచనాలు పెంచుతూ వచ్చాయి. ర‌జనీకాంత్ లుక్ స‌రికొత్తగా ఉండ‌డంతో అభిమానులు పేట మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. 
Image result for petta movie trailer
పెట్టా మూవీని తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తుండ‌గా తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.  ఇక ట్రైలర్ విషయానికి వస్తే..రజినీకాంత్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విధంగా చాలా చలాకీగా..యంగ్ గా కనిపిస్తున్నారు. ఇందులో స‌న్నివేశాలు అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది. చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను వచ్చే నెల మొదటి వారంలో భారీగా, విభిన్నంగా నిర్వహించనున్నట్లు స‌మాచారం. 

మాఫియా నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమాలో సిమ్రాన్ తో రోమాన్స్, రజినీ కాంత్ కామెడీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  ఇక త్రిష గ్లామర్‌, సిమ్రన్‌ అభినయం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. జ‌య్ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాశ్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. అనిరుధ్ ర‌విచంద్రన్ సినిమాకి సంగీతం అందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: