బాలీవుడ్ లో విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఖాదర్ ఖాన్.  జుడ్వా, జుదాయి, అనారీ నం.1, ముఝ్‌సే షాదీ కరోగీ వంటి చిత్రాల్లో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.  తాజాగా ఖాదర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.  ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి కెనడాలో ఉంటున్నారు.  సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని, కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ క్రమంలో ఆయన అక్కడ ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పూ రావడంలేదట.
Actor Kader Khan’s Health in Critical Condition
ఆ మద్య ఖాదర్‌ ఖాన్‌ మోకాలికి శస్త్రచికిత్స జరిగిందని ఆయన కుమారుడు సర్ఫరాజ్‌ మీడియా ద్వారా వెల్లడించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ నటులు ఆరాతీస్తున్నారు..త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారుు. 


మరింత సమాచారం తెలుసుకోండి: