ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగబోతోంది. ఈనెల 30 న జరగనున్న ఈ వేడుక కోసం జైపూర్‌లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. బాహుబళి ఘన విజయంతో దేశంలోనే అగ్ర దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహానికి దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Related image


ఇక రాజమౌళి కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు జైపూర్ తరలివెళ్లారు. ప్రత్యేకించి ఇప్పటికే రాజమౌళితో కలసి పని చేసిన తారలు, అనుబంధం ఉన్న నటులు జైపూర్‌ లో ల్యాండయ్యారు. తండ్రి దర్శకత్వ బాధ్యతలను పంచుకుంటూనే చిత్ర నిర్మాణంవైపు మొగ్గుచూపుతున్న కార్తికేయ పెళ్లిపీటలెక్కుతున్నారు.

Image result for ss karthikeya engagement photos


ఇంతకీ కార్తికేయ పెళ్లి చేసుకోబోయేదెవరో తెలిస్తే కాస్త షాక్ తినడం ఖాయం. వధువు పూజాప్రసాద్ గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే అనేక భక్తి గీతాలు ఆలపించి గాయనిగా నిరూపించుకున్నారువీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం కావడం విశేషం.

SS Karthikeya Pooja Prasad

అంతే కాదు.. ఈ గాయని ప్రముఖ సినీనటుడు జగపతిబాబుకు కుమార్తె వరుస అవుతారు. పూజాప్రసాద్ తండ్రి జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్‌. అంటే రాజమౌళి, జగపతిబాబు వియ్యంకులు కాబోతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: