ఈమధ్య కొంతకాలంగా మౌనంగా ఉంటున్న రేణు దేశాయ్ తీరుతో పవన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేయడం తగ్గించివేసారు. అయితే మళ్ళీ రేణు మళ్ళీ వార్తలలోకి రావడం పవన్ అభిమానులను ఇరుకున పెడుతున్నట్లు సమాచారం. 
Renu Desai
తన మనసులోని భావాలను కవితలుగా మార్చి  'ఎ లవ్ - అన్ కండిషనల్' అనే ఒక పుస్తకం రాసింది రేణు దేశాయ్. ఈ పుస్తకాన్ని తెలుగులో కూడ అనువాదం చేయించి ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమాలలో ప్రస్తుతం రేణు బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె హైదరాబాదులో పలు టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఒక ఇంటర్వ్యూలో తన పుస్తకం గురించి క్లారిటీ ఇస్తూ ఆమె చేసిన కామెంట్స్ మళ్ళీ పవన్ అభిమానులకు అసహనాన్ని కలిగించేలా ఉన్నాయి.
Renu Desai damage Pawan Kalyan image
ఈమధ్య చాలామంది పవన్ అభిమానులు ఈ పుస్తకం పవన్ గురించేనా అని అడుగుతున్నారని కానీ ఈ పుస్తకం పవన్ గురించి కాదని తన జీవితంలోని ప్రతి విషయాన్నీ పవన్ కళ్యాణ్ తో లింక్ చేయవద్దని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతేకాదు తనకంటూ ఒక జీవితం ఉందని ఇప్పటికీ తన ఆలోచనలు అన్నీ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయని పవన్ అభిమానులు ఎందుకు భావిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదు అంటూ కామెంట్స్ చేసింది రేణు దేశాయ్.

ఇప్పటికే అమెరికాకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్ మెంట్ కూడ చేసుకున్న రేణు తన పెళ్ళి డేట్ గురించి కానీ అదేవిధంగా తన భర్త విషయం గురించి కానీ వివరాలు చెప్పడానికి ఆమె ఆసక్తి కనపరచడం లేదు. ఇది ఇలా ఉంటే ఈమె ఈమధ్య ‘కాంచీ పురం వరలక్ష్మీ సిల్క్స్’ వ్యాపార సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడంతో ఈమె ఈ సంస్థకు సంబంధించిన చీరలను ప్రమోట్ చేస్తూ చేసిన యాడ్ అన్ని ప్రముఖ ఛానల్స్ లోను ప్రసారం కాబోతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: