అతితక్కువ కాలంలో యూత్ కి ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాకినాడ చుట్టుపక్కల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈమూవీ వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతోంది. ఈ మూవీ కాకినాడ షెడ్యూల్ ముగింపుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తన పెళ్లి పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి.

తన మనసు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి అన్న సంకేతాలు ఇస్తే తాను అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని తనకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదని కాకినాడలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటె తనకు చెప్పండి అంటూ విజయ్ చేసిన కామెంట్స్ మీడియా వర్గాలకు షాక్ ఇచ్చాయి. అంతేకాదు హైదరాబాద్ లోలా తనను కలవడానికి కాకినాడలో ఎక్కువమంది అమ్మాయిలు తన వద్దకు రాలేదు అంటూ మరో సెటైర్ పేల్చాడు విజయ్.

కాకినాడలో ఈమూవీకి సంబంధించిన షూటింగ్ లో తనకు జరిగిన ప్రమాదం పై స్పందిస్తూ యాక్టింగ్ అనేది డెస్క్ జాబ్ కాదనీ సినిమా షూటింగ్ లో ఫైట్స్ డాన్స్ లు మోటార్ బైక్ ల ఛేజింగ్ లు ఉంటాయి కాబట్టి సినిమాలలో చాల కష్టపడాలని డెస్క్ జాబ్ లా కూర్చుని ఉంటే డబ్బులు ఎవరు ఇస్తారు అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు. ఇదే సందర్భంలో గోదావరి జిల్లాలలో జరగబోయే సంక్రాంతి సంబరాల గురించి కోడి పందేల గురించి మాట్లాడుతూ మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

ఈసారి సంక్రాంతికి తాను తప్పనిసరిగా గోదావరి జిల్లాలకు వచ్చి జనం మధ్య కూర్చుని కోడి పందేలను ఎంజాయ్ చేస్తానని అంటూ గోదావరి జిల్లాల పై తన ప్రేమను వ్యక్త పరుస్తూ పరోక్షంగా ఈ జిల్లాలలో తన అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. విజయ్ తన పెళ్ళి పై ఇలా సెటైర్లు వేసుకోవడంతో టాలీవుడ్ లో పెళ్ళి కాని బ్రహ్మచారుల లిస్టు పెరిగిపోతోంది అంటూ ఆమీడియా సమావేశానికి వచ్చిన మీడియా ప్రతినిధులు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: