నిండైన పంచెకట్టుతో తెలుగుదనానికి చిరునామాగా ఉండే ఎన్టీఆర్ ఇప్పటి తరం క్రేజీ హీరో హీరోయిన్స్ చేతి పై అదేవిధంగా తమ శరీరాల పై వేయించుకుంటున్న ‘టాటూ’ కల్చర్ ను అలనాడే అనుసరించాడు అన్న విషయం చాలమందికి తెలియదు. ప్రస్తుతం నాగార్జున నుండి సమంత నాగచైతన్య నయనతార త్రిష అంజలి లాంటి ఎందరో సెలెబ్రెటీల శరీరాల పై కనిపించే ‘టాటూ’ సంస్కృతి 1960 ప్రాంతంలోనే ఎన్టీఆర్ చేతిమీద కనిపించే ఆసక్తికర విషయం ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ లో కనిపించబోతోంది. 

కృష్ణుడి పేరు వింటే నందమూరి తారకరామారావు గుర్తుకు వచ్చే అలనాటి పరిస్థుతులలో ఎన్టీఆర్ చేతి పై కృష్ణుడి ‘టాటూ’ స్పష్టంగా కనిపించే ఒక సీన్ కు సంబంధించిన స్టిల్ ను దర్శకుడు క్రిష్ మీడియాకు విడుదల చేసి ఈమూవీ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ఎన్నో తెలియని ఆసక్తికర విషయాలు ఈ బయోపిక్ లో ఉండబోతున్నాయి అన్న సంకేతాలు ఇస్తున్నాడు క్రిష్.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదల చేసిన ధియేట్రికల్ ట్రైలర్ కు 80 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ఈ ట్రైలర్ కోటి వ్యూస్ మార్క్ ను అందుకోవడం త్వరలోనే జరగబోతోంది అని అంటున్నారు. ప్రస్తుతం ఈసినిమాకు జరుగుతున్న భారీ స్థాయి బిజినెస్ తో ఈమూవీ విడుదల కాకుండానే బాలకృష్ణకు సుమారు 50 కోట్లలాభం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

వచ్చేనెల సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈసినిమాను అత్యధిక దియేటర్లలో విడుదల చేయడమే కాకుండా ఓవర్సీస్ లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలను చాల అధిక సంఖ్యలో వేసి ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ తీసుకు వచ్చే ఆలోచనలలో బాలయ్య క్రిష్ లు ఉన్నట్లు సమాచారం. రాబోతున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈమూవీ ద్వారా తెలుగుదేశంకు మళ్ళీ జనం చేత భారీగా ఓట్లు వేయించుకోవాలి అన్న ప్రయత్నాల నేపధ్యంలో ఈ బయోపిక్ ఘన విజయం తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: