టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ.   లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’సినిమాతో హీరోగా మారారు.  ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు వరుస విజయాన్ని సాధించాయి. తర్వాత నోటా సినిమా నిరాశపరిచినా..తర్వాత రిలీజ్ అయిన ‘టాక్సీవాలా’మరో ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ నటిస్తున్న విషయం తెలిసిందే.   
Image result for vijay devarakonda dear comrade shooting
కాకినాడలో షూటింగ్ జరుపుకుంటున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు తాజాగా చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసింది.  తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని..ఈ మద్య ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా పూర్తిగా కాకినాడ నేపథ్యంలోనే తెరకెక్కించామన్నారు. నోటా సినిమా తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి..కానీ నాకు అంత సమయం లేదని..ప్రస్తుతం తన కెరీర్ పైనే దృష్టి పెట్టానని అన్నారు. 

దర్శకుడు భరత్ వాస్తవికతకు అద్దం పట్టేలా కాకినాడ మార్కెట్, జగన్నాథపురం బ్రిడ్జ్, బీచ్ ప్రాంతాల్లో ఎక్కువగా సన్నివేశాలు చిత్రీకరించారన్నారు.  ఇక పెళ్లివిషయం..అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగిపోతుందని..ప్రస్తుతం తాను సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.  ఇక తనకు ఆంధ్రాలో కోనసీమ అంటే ఎంతో ఇష్టమని..ఉభయగోదావరి జిల్లాలలో కోడిపందేలు చాలా బాగా జరుగుతాయని విన్నానని... అవకాశం వస్తే చూడాలని ఉందని అన్నాడు.

'డియర్ కామ్రేడ్'  మూవీ షూటింగ్ గోదావరి జిల్లాల్లో  ఆహ్లాదకరంగా కొనసాగిందని చెప్పాడు. తమ సినిమా దర్శకుడు కాకినాడకు చెందిన వ్యక్తి కావడంతో... చాలా వరకు ఇక్కడే షూట్ చేశారని తెలిపాడు. ఇక్కడి సముద్రం, ప్రకృతి అందాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: