ఇప్పడూ సినిమాలకు రిలీజ్ అయిన తరువాత వచ్చే పైరసీ కంటే సినిమా ముందు కొన్ని సినిమా బిట్స్ లీక్ అవ్వడంతో షాక్ కు గురవుతున్నారు. అయితే ఈ బెడద ఏ సినిమా ను వదిలి పెట్టడం లేదు . మొన్న అరవింద సమేత సినిమా కు కూడా ఇటువంటి తలనొప్పి వచ్చి పడింది. కొంతమంది లీకువీరులు సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కొన్ని సన్నివేశాలను లీక్ చేస్తున్నారు.

Image result for leaked maharshi scenes

తాజాగా మహేష్ బాబు 'మహర్షి' సినిమాకు ఇటువంటి సమస్యే తలెత్తింది. ఈ సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో జరుగుతున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టేశారు. వాటిలో మహేష్ బాబు, అల్లరి నరేష్ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయు. అలానే సినిమాలో ఒక పాటకి సంబంధించిన విజువల్స్ కూడా ఆన్ లైన్ లో లీకయ్యాయి. విషయం గ్రహించిన చిత్రబృందం వాటిని ఆన్ లైన్ నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకుంది.

Image result for leaked maharshi scenes

దీంతో సినిమాకు భారీ నష్టం తప్పిందనే చెప్పాలి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే చివరి షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది. వంశీపైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీనితో సినిమా ఎట్టి పరిస్థితిలో లీక్ అవ్వకుండా చిత్ర యూనిట్ ఇంకా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొన బోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: