తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది అనుష్క.  సూపర్ చిత్రంతో తన ప్రస్థానం మొదలు పెట్టి ఇటీవల భానుమతి చిత్రం వరకు ఎన్నో అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రాల్లో నటించింది అనుష్క.  మొదట్లో గ్లామర్ కి ప్రాధాన్యత ఇచ్చిన అనుష్క తర్వాత కాలంలో నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ..లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ వచ్చింది.  అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 

అయితే భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో రచయిత కోన వెంకట్ నిర్మాణంలో ఓ చిత్రంలో నటించబోతుంది. ఇంత గ్యాప్ తీసు కోవడానికి  కారణంగా..తన శరీర బరువుని తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు చేయడమే. ఇటీవల దర్శకుడు హేమంత్ మధుకర్ చెప్పిన కథ నచ్చడంతో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో మాధవన్ హీరోగా  కనిపించనున్నాడు.

కోన వెంకట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనుష్క అంధురాలిగా కనిపించనుందని సమాచారం. తాజాగా ఆమె రాజమౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్ వెళ్లింది. ఎయిర్ పోర్ట్ లో కొందరు ఆమెని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.  ఈ ఫోటోలో మాత్రం అనుష్క సన్నబడినట్లు కనిపించడం లేదు. కాగా, అనుష్క నటిస్తున్న చిత్రానికి ‘సైలెన్స్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని సమాచారం. జనవరి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: