ఈ మద్య స్టార్ హీరోలు ఏం చేసినా సోషల్ ఇట్టే వైరల్ అవుతున్నాయి.  సాధారణంగా సెలబ్రెటీలు పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఖరీదైన బట్టలు, షూ, వాచ్ లు ధరించి రావడం మామూలే..అయితే ఈ మద్య స్టార్ హీరో, హీరోయిన్లు ఖరీదైన వస్త్రాలు, వాచ్ లు పెట్టుకొని రావడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఆ మద్య అల్లు అర్జున్ 'టాక్సీవాలా' సినిమా ప్రీరిలీజ్ కోసం వేసుకొచ్చిన టీషర్ట్ ఖరీదు అక్షరాలా రూ.65 వేలు..ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  గతంలో షారూఖ్ కూతురు సుహానా ఖాన్ ధరించిన షూ పై హాట్ టాపిక్ నడిచింది. 

టాలీవుడ్ కంటే బాలీవుడ్ స్టార్లు తమ దుస్తులు, వాచ్ లు ఇలా ప్రతీ దానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా మేమేమైనా తక్కువా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.  ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు వివాహం జైపూర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ సెలబ్రెటీలు అంతా ముందుగానే జైపూర్ వెళ్లారు.  అక్కడ విమానాశ్రయంలో ఎన్టీఆర్, రాంచరణ్, రానా, నానిలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. 

ఇందులో ప్రత్యేకంగా ఎన్టీఆర్ పై మీడియా కళ్లు ప్రత్యేకంగా పడ్డాయి. ఎందుకంటే ఆయన ధరించిన వాచ్..ఆ వాచ్ సింపుల్ గా కనిపిస్తున్నా.. ఆ రేట్ ఎంతో తెలుసుకున్న అభిమానులు షాక్ తింటున్నారు. ఇంతకీ రేట్ ఎంత అనుకుంటున్నారా..?అక్షరాలా రూ.2 కోట్ల 27 లక్షలు.  రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీకి చెందిన ఈ వాచ్‌ని ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు ధరిస్తుంటారట. అవును తమ అభిమాన హీరో రేంజ్ చూసి నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  సంక్రాంతి తరువాత నుండి రెండో షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: