క్వీన్ మూవీ తమిళ్ రీమేక్ లో కాజల్ నటించిన హాట్ సీన్ పైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే ఇంత వరకు ఈ సీన్ మీద కాజల్ స్పందించడం లేదు . . లెస్బియన్ రొమాన్స్ తరహాలో ఉన్న ఆ సీన్ లో కాజల్ చిరు కోపాన్ని  ప్రదర్శిస్తూ నటించింది. ఇప్పటికే ఆ బిట్ ను సెమీ పోర్న్ సైట్లు వాడుకొంటూ ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో అవకాశాలున్న కాజల్ అలాంటి సీన్లో నటించడం పట్ల కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా.  ఈ సీన్ సినిమాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది కానీ సంప్రదాయవాదులు మాత్రం కాజల్ పైన.. దర్శకుడు రమేష్ అరవింద్ పైన ఘాటుగా విమర్శలు గుప్పించారు.


పబ్లిసిటీ కోసం దిగజారిపోయారని ఆరోపించారు. అయితే ఆ సినిమా దర్శకుడు రమేశ్ అరవింద్ దీనిపై స్పందించాడు. ఆ సీన్లో తప్పులు వెదకొద్దని ఈ నటదర్శకుడు అంటున్నాడు. ట్రైలర్లో ఆ బిట్ వల్ల మీకు తప్పుగా అనిపించవచ్చు. అయితే సినిమాలో ఆ సీన్ ఏమీ తప్పుగా అనిపించదు అని రమేశ్ అరవింద్ అంటున్నాడు. ఇలా సమర్థించుకొంటూనే.. మరోవైపు డిఫెన్సివ్ వాదనను కూడా షురూచేశాడు. తమ సినిమాకు ఒరిజినల్ అయిన క్వీన్లో కూడా ఆ తరహా సన్నివేశం ఉందని, అందుకే తమ సినిమాలో ఆ సీన్ ను పెట్టామని రమేశ్ అరవింద్ అంటున్నాడు.

Image result for kajal in queen tamil

ఒరిజినల్ లో ఆ సీన్లో నటించిన కంగనా రనౌత్ కు జాతీయ అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేస్తున్నాడు. ఇక క్వీన్ తెలుగు, మలయాళ రీమేక్ లలో మాత్రం ట్రైలర్లో ఆ సీన్ చూపలేదు. సినిమాలో ఉందో లేదో కానీ ట్రైలర్లో ఆ సీన్ ను చూపలేదు. ఆ సీన్ కు ముందు.. వెనుక వచ్చే సన్నివేశాలు చూస్తే ఆ సీన్ ఇంపార్టెన్స్ తెలుస్తుందని చెప్పుకొచ్చాడు.  ట్రైలర్ మాత్రమే చూసి విమర్శలు చేయడం సరికాదన్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: