ప్రేమ అభిమానం ఆప్యాయత అనే పదాలకు చాల దూరంగా ఉంచే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత జీవితం ఎవరికీ అర్ధం కాని విషయం. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలు షేర్ చేసాడు. 

నిరంతరం ఏదో ఒక ఆలోచనలు చేస్తూ అనునిత్యం టెన్షన్ లో ఉండే తనకు రకరకాల కలలు వస్తాయని హారర్ నుండి సెక్స్ వరకు వచ్చే రకరకాల కలలతో తనకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు అని కామెంట్ చేసాడు. తనకు ఒక భయంకరమైన రోగం వచ్చి మంచం పై పొడుకుని సహాయం చేసేవాళ్ళు లేక బ్రతకవలసిన పరిస్థుతులలో తాను ఉన్నట్లు ఫీల్ అయ్యే కలలు వస్తున్నాయని అంటూ తన కలల గురించి వివరించాడు వర్మ. 

అయితే తాను మానసికంగా బలహీనుడుని కాననీ అయినా తనకు ఇలాంటి కలలు ఎందుకు వస్తున్నాయో తెలియక ఎంతోమంది డాక్టర్స్ ను కలిసినా తనకు సమాధానం దొరకడం లేదు అంటూ తాను పడుతున్న ప్రస్తుత బాధను వివరించాడు వర్మ. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తాను ఒకరిలా బతకాలని కోరుకోనని అయితే తనకు బాగా ఇష్టమైన కొందరు ప్రముఖ వ్యక్తుల జీవిత సారాన్ని ఒక గ్లాస్ లో పోసుకుని తాగేస్తూ వారందరి భావాలు తనలో కలిసిపోతున్నాయి అన్న ఫీలింగ్ తనకు కలుగుతుంది అంటూ తనకు ఉన్న అలవాట్ల పై తానే సెటైర్ వేసుకుంటున్నాడు వర్మ.

ప్రపంచంలో ఏవిషయం నేరం కాదనీ వ్యక్తిగత స్వేచ్చకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దేశాలు అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోతున్నాయని ఒక వ్యక్తి మద్యం తాగితే తప్పు వ్యభిచారం చేస్తే తప్పు అని చెప్పకుండా వాటివల్ల వచ్చే నష్టాలను జనానికి వివరించకపోతే ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం సూన్యం అంటూ కామెంట్ చేస్తున్నాడు వర్మ. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ వర్మ సమస్య ఉంది అనుకుంటే సమస్య ఉంటుంది అనీ లేదు అనుకుంటే ఆసమస్య ఎంత పెద్దది అయినా ఎవర్ని ఏమీచేయదనీ అందువల్లే తన పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మరెన్ని కేసులు తన పై పెట్టినా తాను పట్టించుకోను అంటూ తనలోని భావాలను బయటపెట్టుకున్నాడు వర్మ.. 



మరింత సమాచారం తెలుసుకోండి: