తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా తారా జువ్వలా దూసుకు వచ్చిన రష్మిక మందన సైకాలజీలో అదేవిధంగా జర్నలిజంలో గ్రాడ్యుయేట్. చిన్నతనం నుండి స్విమింగ్ త్రోబాల్ పోటీలలో స్కూల్ కాలేజీ ఛాంపియన్ గా కొనసాగిన రష్మిక అనుకోకుండా హీరోయిన్ అయింది. అయితే అతి కొద్ది కాలంలోనే ఈమె క్రేజ్ పెరిగిపోవడమే కాకుండా 2018 సౌత్ ఇండియన్ మోస్ట్ గూగుల్ద్ సర్చ్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన రష్మిక ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గూగుల్ద్ హీరోయిన్ స్టేటస్ పై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.

తన చిన్నతనంలో ఒక స్కూల్ డ్రామాలో తాను నటించినప్పుడు తన నటనను చూసి తన టీచర్ నటనకు తాను పనికి రాను అంటూ అప్పట్లోనే చెప్పడంతో తనకు హీరోయిన్ అవ్వాలనే కలలు లేవనీ అయితే అనూహ్యంగా తనకు అవకాశాలు రావడమే కాకుండా ఏకంగా ‘మోస్ట్ గూగుల్డ్’ హీరోయిన్ స్టేటస్ తనకు ఆశ్చర్యం కలిగిస్తూ కేవలం అదృష్టం మాత్రమే అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు చాలామంది గూగుల్ సర్చ్ లో తన గురించి ఎందుకు వెతికారో తెలియదు అనీ తాను సాధారణ బ్యూటీని మాత్రమే కాకుండా నటన విషయంలో కూడ సాధారణ నటిని మాత్రమే అంటూ కామెంట్స్ చేసింది.

మొదట్లో తన సినిమాలకు సంబంధించి పెద్దపెద్ద డైలాగులు చూసినప్పుడు వాటిని చెప్పలేక విపరీతమైన టేక్స్  తీసుకుంటూ ఏడ్చిన సందర్భాలను వివరిస్తూ తాను ఈ స్థాయికి వస్తానని కలలో కూడ అనుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఎవరైనా తనను హీరోయిన్ మేడమ్ యాక్ట్రెస్ అనే పదాలతో పిలిస్తే తనకు భయం అనీ కేవలం తనను తన పేరుతో పిలవమని అడుగుతానని అంటూ రష్మిక ఇప్పటికీ తనకు ఏర్పడ్డ సెలెబ్రెటీ స్టేటస్ ను అంగీకరించ లేకపోతోంది.

ఈ ఏడాదిలో వరసగా వచ్చిన మూడు విజయాలు తనను భయపెడుతున్నాయి అంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి విజయాలు రావాలి అంటే తాను ఎక్కడ నుంచి తెగలను అంటూ భయపడిపోతోంది రష్మిక. తెలుగులో తన పేరు వ్రాయడం ఇప్పుడిప్పుడే నేర్చుకున్న తనకు తెలుగు ప్రజలు తన పై చూపిస్తున్న అభిమానం కలకాలం కొనసాగాలని ‘నేను బాగుండాలి కానీ అందరూ నాతో పాటు బాగుండాలి’ అంటూ రష్మిక తన అభిమానులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: