రజనీకాంత్ అంటేనే మాస్ కి ఓ పూనకం. ఆయన అలాంటి రోల్ వేయాలి కానీ చూసేందుకు రెడీ అంటారు. అటువంటి అభిమానులకు ఇపుడు రజనీ ఆ ముచ్చట తీర్చబోతున్నారట. రజనీ అంటే అలాంటి ఇలాంటి రజనీ కాదు. పాతికేళ్ళ వెనక్కు వెళ్తే  ఎలా ఉంటాడో అలాంటి రజనీ, ఫుల్ ఎన‌ర్జెతో దూసుకు వస్తే ఇక అభిమానులకు పండగేగా మరి.


రజనీ పెట్ట మూవీని కొత్త ఏడాది సంక్రాంతికి రిలీజు చేస్తున్న సంగతి విధితమే. ఈ మూవీ అన్ని హంగులతో విడుదలకు ఇపుడు సిధ్ధంగా ఉంది. ఇప్పటికే 2ఒ మూవీ సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న రజనీ పెట్టాతో బంపర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. ఈ మూవీ అంతా రజనీ స్టైల్ ని బాగా వాడేసుకుంటూ ఆయన పాత చిత్రాల ఒరవడితో ఉంటుందని టాక్. రజనీని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఫిదా అవుతారో అన్నీ ఇందులో ఉంచి సినిమాని మాస్ మసాలాగా డిజైన్ చేశారట.


ఈ మూవీలో మాంచి రోమాన్స్ తో పాటు  మాస్ సాంగ్స్, యాక్షన్ పార్ట్ కూడా దండీగా ఉంటుందంటున్నారు. సిమ్రాన్, త్రిష రజనీకి జోడీగా నటించిన ఈ మూవీలో నవరసాలు రంగరించి మరీ సంక్రాంత్రి పందెం కోడిలా రిలీజ్ చేస్తున్నారు. చూడబోతే ఇలాగే మాస్ కధాంశంతో తెలుగులో మెగా పవర్ స్టార్ రాం చరణ్ మూవీ వినయ విధే రామా సంక్రాంతి టార్గెట్ గా జనవరి 11న వస్తోంది.  జనవరి 10న పెట్టా విడుదల అవుతోంది.
దాంతో రెండు మాస్ ఎంటర్టైనర్లు పోటా పోటీగా వస్తున్నాయన్నమాట. ఓ విధంగా చూసుకుంటే రామాకు రజనీయే పెద్ద పోటీ అవుతారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అన్నగారి బయోపిక్ , వెంకీ, వరుణ్ తేజ్ ల ఎఫ్ ట్ కంటే కూడా రజనీ మూవీతోనే రిస్క్ చేయాల్సి వుంటుందని రామా టీమ్  అంచనాలు వేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: