సినీ పరిశ్రమ విచిత్రమైంది.. వస్తే వరుసగా హిట్లు పలకరిస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఎంత పలవరించినా హిట్ అన్నదే దక్కదు. హీరోలకే కాదు.. ఈ కష్టాలు హీరోయిన్లకూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి కష్టంలోనే ఉంది మెగా కాంపౌండ్ హీరోయిన్ మెహరీన్.

meHREEN hot కోసం చిత్ర ఫలితం


నాని సినిమా కృష్ణగాడివీరప్రేమగాథతో హిట్ సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత రాజాది గ్రేట్ వంటి హిట్ అందుకుంది. ఆ తర్వాత శర్వానంద్‌తో మహానుభావుడు యావరేజ్ అనిపించుకున్నా.. ఆ జోష్‌లోనే అల్లు అర్జున్ సరసన కేరాఫ్ సూర్యలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ అమ్మడు టాప్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్న సమయంలో అప్పటి నుంచి పాపం హిట్ అన్నదే కనిపించకుండాపోయింది.

సంబంధిత చిత్రం


కేరాఫ్ సూర్యతో పాటు మరో మెగా కాంపౌండ్ హీరోతో నటించిన జవాన్ కూడా హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన పంతం, నోటా, కవచం కూడా నెగిటివ్ రిజల్ట్ నే ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో మిగిలిన ఏకైక సినిమా ఎఫ్‌ 2 మాత్రమే. సినిమా పేరుకు తగ్గట్టు ఫన్ సంగతేమో కానీ అమ్మడు తెగ ఫస్ట్రేషన్ అవుతోందట.

సంబంధిత చిత్రం


ఒక్కసారి ఫ్లాప్ హీరోయిన్ అన్న ముద్రపడిందంటే.. దాన్ని చెరుపుకోవడం అంత ఈజీకాదు. అందులోనూ సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదువలేదు. అందుకే ఈ ఎఫ్‌ 2 సినిమా ఫలితం ఏమవుతుందోనని తెగ టెన్షన్ పడుతోంది మెహరీన్. 2019 అయినా ఈ ముద్దుగుమ్మకు సక్సస్ ఇవ్వాలని కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: