సీనియర్ నటి జమున ఏదైనా తన మనసులో అనుకుంటే ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న జమున ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు సలహాలు లాంటి హెచ్చరికలను ఇచ్చింది. ఒకప్పుడు రాజకీయాలు గౌరవప్రధంగా ఉండేవనీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది జమున.
మా తరం వరకు రాజకీయాలు హాయి
ప్రస్తుతం రాజకీయాలలో గెలవాలి అంటే కనీసం 20-30 కోట్లు ఖర్చుపెట్టి అదృష్టం కలిసి వచ్చి గెలిచాక వందల కోట్ల సంపాదన గురించి బిజినెస్ ఆలోచనలుగా మారాయని సేవా దృక్ఫథంతో ఉన్న రాజకీయ నాయకులు ఇప్పుడు లేరు అంటూ నేటి రాజకీయాల పై తన అభిప్రాయాన్ని ఆమె వెల్లడించింది. అంతేకాదు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా తనతోపాటు కృష్ణ కృష్ణంరాజులు రాజకీయాలలోకి వచ్చి పదవులు పొందినా తమలో ఎవ్వరికీ రాజకీయాలు ద్వారా డబ్బు సంపాదించే అలవాటు లేదు అంటూ కామెంట్స్ చేసింది.
సినిమా వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది
ఇదే సందర్భంలో చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవిని రాజకీయాలలోకి వెళ్ళవద్దని తాను సలహా ఇచ్చానని అయితే తన సలహాకు చిరంజీవి నవ్వి ఊరుకుని రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఏమి సాధించాడు అంటూ ఆమె ఎదురు ప్రశ్నలు వేస్తోంది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ గురించి మాట్లాడుతూ ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంది
ప్రజలు సినిమా తారలను దేవతలుగా ఆరాధిస్తారని దేవతలు పూజింప బడాలి కానీ జనం మధ్యకు వెళ్లి తిరస్కరణకు గురి కాకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది జమున. తనకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తో పరిచయం లేకపోయినా అతడి మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం బట్టి పవన్ మనస్తత్వం రాజకీయాలకు సరిపోదు అంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. పవన్ ను అతడి అభిమానులు దేవుడుగా ఆరాధిస్తున్నారాని అటువంటి అదృష్టాన్ని వదులుకుని ప్రస్తుతం ఎవ్వరు మార్చలేని రాజకీయాలలోకి వచ్చి పవన్ ఏమి చేయగలడు అని ప్రశ్నిస్తూ పవన్ కు హెచ్చరికలు చేస్తోంది ఒకప్పటి రాజకీయ నాయకురాలు అయిన నటి జమున..  



మరింత సమాచారం తెలుసుకోండి: