విశాఖ అంటేనే అందాల సుందరి. ఇక్కడ ఎన్నో సినిమాలు పుట్టి చరిత్రను స్రుష్టించాయి. ఇక్కడ కొండలు, బీచ్ అందాలు, పచ్చదనాల  పరువాలు, మన్య సీమల సోయగాలు, గ్రామీణంలోని సొగసులు అన్నీ వెండి తెరపై బంగారం పండించాయి. ఇక్కడ సినిమా తీస్తే చాలు హిట్ అన్న సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు విశాఖలో పట్టుపట్టి నిర్వహిస్తారు. అలా చేసిన సినిమాలు కోట్లు కొల్లగొట్టాయి. రంగస్థలం దానికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి. మరి అలాంటి  విశాఖని ప్రేమించని వారు ఎవరు ఉండరు కదా.


విశాఖ ఉత్సవ్ వేళ బీచ్ లో  జరిగిన ఓ కార్యక్రమంలో ఎఫ్ 2 సినిమా ఆడియోని విడుదల చేశారు. ఈ సందర్భంగా వేదిక మీద చిందులేసిన విక్టరీ వెంకటేష్ విశాఖతో తనకు మధురమైన గురుతులు ఎన్నొ ఉన్నాయని చెప్పుకొచ్చారు. విశాఖలోనే తన తొలి సినిమా కలియుగ పాండవులు తీసామని, ఇక్కడ మల్లీశ్వరి కత్రినా కైఫ్ తాను బీచ్ లో నడచిన అనుభవాలు ఉన్నాయని చెప్పారు. ఆ తరువాత కూడా అనేక చిత్రాలు ఇక్కడ తీశామని, అవన్నీ హిట్లేనని వెంకీ చెప్పారు. విశాఖను ఎప్పటికీ మరచిపోలేమని, ఇక్కడ ప్రజలను కూడా మరువలేమని వెంకీ తన నిండైన అభిమానాన్ని చాటుకున్నారు.


ఇక విశాఖలో రెండు దశాబ్దాల క్రితం లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు కట్టిన స్టూడియో ఉంది. దానిలో షూటింగులు జరిపి ఇక్కడ యాక్టివిటీని పెంచేందుకు కూడా వెంకీ సుముఖంగా ఉన్నారు. రానున్న రోజుల్లో రెండవ ఫిల్మ్ సిటీగా విశాఖ మారుతుందని కూడా చిత్ర ప్రముఖులు అంటున్నారు. కాగా ఎఫ్ 2 ఆడియో ఫంక్షలో నిర్మాత దిల్ రాజు, మరో హీరో వరుణ్ తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడొ పాల్గొని మొత్తం ఉత్సవాలకే కొత్త  కాంతి తెచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: