ఎన్టీఆర్ బయోపిక్ కు ఊహించని సెన్సార్ సమస్యలు రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈసినిమా సెన్సారింగ్ కార్యక్రమాలు ఈనెల 29న పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసారు. ప్రసాద్ ల్యాబ్ లో ఈమూవీని సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డ్ కూడ అంగీకారం తెలియచేసింది. 

అయితే ఆఖరి నిముషంలో ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలకు బాలకృష్ణ అడ్డు తగిలినట్లు సమాచారం. దీనికి కారణం బాలయ్యకు మంచి రోజులు మీద ముహూర్తాల మీద ఉన్న విపరీతమైన నమ్మకం. సెన్సారు బోర్డ్ సభ్యులు మొన్న 29న ఈసినిమాను చూస్తామన్న సమయంలోని ఘడియలు బాగాలేవని అందువల్ల ఈసినిమాను సెన్సార్ బోర్డ్ సభ్యులు జనవరి 3న చూడమని కోరినట్లు సమాచారం.

దీనితో షాక్ అయిన సెన్సార్ అధికారులు ఈవిషయమై మళ్ళీ ఫ్రెష్ గా అప్లయ్ చేసుకోమని దర్శకుడు క్రిష్ కు చెప్పినట్లు టాక్. వాస్తవానికి ఈసినిమా విడుదలకు ఇంకా
సమయం ఉంది కాబట్టి ఖంగారు లేదు కానీ లేకుంటే బాలయ్య నమ్మకాలతో తన పరిస్థితి ఏమిటి అని క్రిష్ మధన పడుతున్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా వచ్చేనెల 9న విడుదల కాబోతున్న ఈమూవీకి మొదటిరోజున అత్యధిక స్థాయిలో ధియేటర్లు దక్కినా ఆతరువాత వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఎన్టీఆర్ బయోపిక్ కు ఊహించన స్థాయిలో అత్యధిక ధియేటర్లు నిలబడటం లేదని టాక్. ఈమూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా వెంటనే విడుదల కాబోతున్న ‘వినయ విధేయ రామ’ ‘ఎఫ్ 2’ సినిమాలకు సంబంధించి అల్లు అరవింద్ దిల్ రాజ్ చేతిలోని ధియేటర్లు అన్నిటిలోనూ ఎన్టీఆర్ బయోపిక్ ను సంక్రాంతి లోపే తీసేస్తారని టాక్. దీనితో ఈమూవీ ఓపెనింగ్స్ బాగానే ఉన్నా సంక్రాంతి సీజన్ ను పూర్తిగా బాలయ్య ఉపయోగించుకోలేడు అన్నవార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: