ప్రస్తుతం ఒక సినిమా ఘన విజయం సాధించాలి అంటే ఆమూవీకి వచ్చే ఓవర్సీస్‌ కలక్షన్స్ కూడ అత్యంత కీలకంగా మారుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో కనీసం 10 కోట్ల కలక్షన్స్ రాకపోతే ఆసినిమాను పరాజయాల లిస్టులో చేరుస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘వినయ విధేయ రామ’ కు ఓవర్సీస్ ప్రేక్షకులలో ఇప్పటికీ క్రేజ్ ఏర్పడక పోవడం ఆమూవీ ఓవర్సీస్ బయ్యర్లను భయపెడుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కామెడీలేని సినిమాలను ఓవర్సీస్ ప్రేక్షకులు చూడటం లేదు. దీనికితోడు ఇప్పటి వరకు ‘వినయ విధేయ రామ’ కు సంబంధించి విడుదల అయిన టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్న నేపధ్యంలో ఓవర్సీస్ ప్రేక్షకులు ఈమూవీ పై పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని టాక్. 

దీనికితోడు  ఓవర్సీస్‌ ఫ్రెండ్లీ సినిమాల్లా కనిపిస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్ ‘ఎఫ్‌ 2’ లతో చరణ్ సినిమా విడుదల అవ్వడం ఈమూవీకి ఏమాత్రం మంచిది కాదని ఈ సినిమాని ఏడు కోట్లకి కొన్న ఓవర్సీస్‌ బయ్యర్‌ గగ్గోలు పెడుతున్నట్లు తెలుస్తోంది.దీనికితోడు బోయపాటి చిత్రాలకి ఓవర్సీస్‌లో కలక్షన్లు రావు. దీనితో ఈమూవీ టైటిల్ తప్పించి మిగతాది అంతా మాస్ సినిమాలా కనిపిస్తూ ఉండటంతో ఈ నెగిటివ్ ట్రెండ్ ను చరణ్ ఎంత వరకు అధికమించగలడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమాకు ఇప్పటి వరకు 90 కోట్ల బిజినెస్ అయిన నేపధ్యంలో ఈమూవీ బయ్యర్లు గట్టెక్కాలి అంటే 150 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావాలి అన్న ప్రచారం జరుగుతోంది.
‘రంగస్థలం’ తో చరణ్ మార్కెట్ పెరిగింది అని భావించినా ఎటువంటి పోటీ లేకుండా సమ్మర్ లో రిలీజ్ అయిన ‘రంగస్థలం’ కు విపరీతమైన పోటీ మధ్య సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదలవుతున్న ‘వినయ విధేయ రామ’ కు పోలిక ఏమిటి అంటూ మరికొందరు అప్పుడే ఈసినిమా విడుదల కాకుండానే నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టేసారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: