టాలెంటెడ్ ఆర్టిస్టుగా పేరున్న సాయిపల్లవి ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. సహజీవనంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఆమె కూడా ఎవరితోనైనా డేటింగ్‌లో ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

sai pallavi hd images కోసం చిత్ర ఫలితం

సహజీవనం తప్పేమీ కాదని.. తాను సహజీవనానికి వ్యతిరేకం కాదని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లీవింగ్‌ టుగెదర్‌ సంబంధం సాగిస్తున్నారా? లాంటి ప్రశ్నలు చాలా మంది తనను అడుగుతున్నారని ఆమె చెప్పింది.

సంబంధిత చిత్రం


ఐతే.. తనకు సహజీవనం సంబంధాలు అవసరం లేదని, అలా అని అలాంటి సంబంధాలకు తాను వ్యతిరేకం కాదని సాయి పల్లవి చెప్పింది. లివింగ్‌ టు గెదర్‌ సంబంధం అనేది వారి పర్సనల్ కు సంబంధించిందని.. తాను మాత్రం వివాహ జీవితాన్నే కోరుకుంటున్నానని సాయిపల్లవి చెప్పింది.

సంబంధిత చిత్రం


కానీ.. డేటింగ్‌కు తాను వ్యతిరేకం కాను అన్న విషయమే ఇప్పుడు హైలెట్ అవుతోంది. సాయిపల్లవి ఇప్పటికే ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా.. అంటూ నెటిజన్లు కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజం మాట్లాడినా నిష్టూరమే అంటే ఇదేనేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: