తెలుగు ఇండస్ట్రీలో రేబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ‘ఈశ్వర్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఏవీ పెద్దగా సక్సెస్ కాలేదు.  దాంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కి ‘చత్రపతి’లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించారు దర్శకధీరుడు రాజమౌళి.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ‘బాహుబలి, బాహుబలి 2’చిత్రాలు ఏకంగా జాతీయ స్థాయి లో ప్రభాస్ కి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాజమౌళి కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు ఏ చిత్రాల్లో నటించకుండా ఎంతో డెడికేషన్ ‘బాహుబలి’సీరీస్ కంప్లీట్ చేశాడు. 

ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో ’నటిస్తున్నాడు.  దాంతో ఇండస్ట్రీలో రాజమౌళి, ప్రభాస్ కి ఎంతో మంచి రిలేషన్ ఏర్పడింది.  తాజాగా  ఎస్‌ఎస్‌ రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం, జగపతిబాబు అన్న కుమార్తె పూజాతో నిన్న రాత్రి అంగరంగ వైభవంగా ముగిసింది. రాజస్థాన్‌ లోని జయపుర‌ పట్టణంలోని ఓ ప్యాలెస్‌ ఈ వివాహానికి వేదిక కాగా, వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ ఒక్కటయ్యారు.నిన్న పెళ్లి వేడుకకు ముందు పూజా ప్రసాద్ కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్‌ కూడా తన చేతులతో మోస్తూ వివాహ మండపానికి తీసుకు వచ్చారు.

ప్రభాస్‌ పల్లకిని మోస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో సంగీత్ నుంచి అప్పగింతల వరకూ తారక్‌, ప్రభాస్, రామ్ చరణ్‌, రానాలు రాజమౌళితోనే కలిసుండటం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: