భారతీయ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. మొదట బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ ని సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు.  తర్వాత తెలుగులో ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  తమిళ్ లో విశ్వనటుడు, కన్నడలో కిచ్చా సుదీప్, మళియాళంలో మోహన్ లాల్ లు వ్యాఖ్యాతలుగా ఉన్నారు. 


బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు 12 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారు. గత 105 రోజులుగా హిందీ టీవీ ఆడియెన్స్‌ని అలరిస్తున్న బిగ్‌బాస్ సీజన్—12 విజేత ఎవరో తేలిపోయింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలో 'ససురాల్ సిమర్ కా' టీవీ షో నటి దీపికా కక్కడ్ ఇబ్రహీం విజేతగా నిలిచి సీజన్-12 ట్రోఫీ అందుకున్నారు. 

Image result for దీపికా కక్కడ్

తొలుత నుంచి ఈ కార్యక్రమంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీశాంత్ తొలుత నుంచి చాలా కోపంగలవాడని ముద్రపడింది. హౌస్‌లో తోటివాళ్ల మీద కోపాన్ని ప్రదర్శించాడు. ఓసారి తలను గోడకు గుద్దుకుని ఆస్పత్రి పాలై వార్తల్లో నిలిచాడు. అంతకుముందు క్రికెట్ ఆటలో కూడా అనేక వివాదాల్లో వున్నాడు.  మొత్తానికి సీజన్ 12 పూర్తి అయ్యింది. 

Telugu news Bigg Boss 12 Sreesanth, Dipika or Romil, who will lift the winner’s trophy Cast your votes

శ్రీశాంత్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, దీపక్ ఠాకుర్ సెకెండ్ రన్నరప్‌గా నిలిచారు. విజేతను ప్రకటించగానే దీపిక ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. బిగ్‌బాస్ వేదికకు సలాం చేస్తూ, కన్నీరు పెట్టుకున్నారు. ఫినాలేలో ఆమెకు మద్దతుగా నిలిచేందుకుందుకు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కార్యక్రమానికి హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: